/rtv/media/media_files/2025/07/14/elderly-woman-duped-of-1-lakh-rupees-by-cyber-fraudsters-in-hyderabad-2025-07-14-18-51-36.jpg)
Elderly woman duped of 1 lakh rupees by cyber fraudsters in hyderabad
అమెజాన్‌లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌లో ఓ వృద్ధురాలు (60) ఉంటోంది. ఇటీవల ఆమె అమెజాన్‌లో ఓ వస్తువుని కొనుగోలు చేసింది. కానీ అది నచ్చకపోవడంతో రిటర్న్ చేసి రిఫండ్ తీసుకోవాలనుకుంది.
Also Read: మోదీపై అభ్యంతరకర కార్టూన్.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం
Also Read : ఈ 5 అలవాట్లతో హైబీపీ.. ముందుగా గుర్తించకపోతే ఆరోగ్యానికి ప్రమాదమే!
Cyber Fraudsters In Hyderabad
దీంతో కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికింది. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు ఆమెకు ఫోన్ చేసి రిఫండ్ చేయిస్తామని నమ్మబలికారు. స్క్రీన్ షేరింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. ఆ తర్వాత బాధితురాలి మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం డబ్బులు రిఫండ్ కావట్లేదని.. బ్యాంక్ వివరాలు ఇవ్వాలని అడిగారు. వాళ్లని గుడ్డిగా నమ్మిన ఆ వృద్ధురాలు తన SBI, యూనియన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చింది. దీంతో వెంటనే ఆ రెండు బ్యాంక్ అకౌంట్లలో నుంచి రూ.1.07 లక్షలు డెబిట్ అయిపోయాయి. తాను మోసపోయానని తెలుసుకుని వృద్ధురాలు షాకైపోయింది. చివరికి సైబర్ క్రైం పోలుసుకు ఫిర్యాదు చేసింది.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు కూడా అమాయకులకు వల వేసి డబ్బులు కాజేసేందుకు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అందుకే ఎప్పుడు కూడా తెలియని లింకులను నొక్కవద్దని, బ్యాంక్ డీటెల్స్ గురించి ఎవరికీ చెప్పొద్దని సైబర్ అధికారులు సూచిస్తున్నారు.
Also Read : భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. 10 లక్షలమందికి ఉపాధి
Cyber Crime | amazon | telangana | rtv-news | telugu-news