సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు NOC జారీ.. ఆమోదించిన ఛత్తీస్‌గఢ్ సీఎం
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ఘటనా స్థలంలో AK 47, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కలు తిన్న ఆహారం, సగం తిని వదిలేసిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం పెట్టడం దుమారం రేపింది. విషయం తెలియడంతో ముందుజాగ్రత్తగా విద్యార్థులకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికకు I Love You చెప్పడం లైంగిక వేధింపు కేసుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు తీర్పును జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్ నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం సమర్థించింది.
ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఛత్తీష్‌గఢ్‌లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. దీంతో కొందరు లొంగిపోతామంటున్నారట.
ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొత్త దళపతిని ఎన్నుకోనుంది. గణపతి, మల్లోజుల వేణుగోపాల్, బెంగాల్‌కు చెందిన రాజా పదవి రేసులో ఉండగా.. గణపతికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్ పెట్టారు. 'నక్సలిజంపై చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మట్టుబెట్టడం ఇదే తొలిసారి. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం' అన్నారు.