/rtv/media/media_files/2025/10/29/51-maoists-surrender-in-chhattisgarh-2025-10-29-18-26-18.jpg)
51 Maoists surrender in Chhattisgarh's Bijapur
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్(chattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో మరో 51 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. వీళ్లలో 9 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలినవారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. గత కొన్నిరోజులుగా మావోయిస్టులు దశల వారీగా పోలీసులకు లొంగిపోతున్న సంగతి తెలిసిందే.
Also Read: కారు లేకుంటే అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
51 Maoists Surrender In Bijapur
ఇదిలాఉండగా మావోయిస్టు పార్టీకి చెందిన తెలంగాణ కీలక సభ్యులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు మంగళవారం లొంగిపోయారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ డీజీపీ ముందు ఆయుధాలు వీడి లొంగిపోయారు. అయితే చంద్రన్నపై రూ. 25 లక్షల రివార్డు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. మరో 64 మంది అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడించారు.
Also Read: షాకింగ్.. కలుషిత ఆహారం తిని 128 మంది విద్యార్థులకు అస్వస్థత
వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇటీవల భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. చాలామంది మావోలు ఈ కాల్పుల్లో మృతి చెందారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా చాలా మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఏకంగా 71 మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీళ్లలో కాంకేర్ ప్రాంతం నుంచే 50 మావోలు, నారాయణ్‌పూర్ జిల్లాలో 21 మంది లొంగిపోయారు.
Also Read: ఈసారి రిపబ్లిక్ డే డబుల్ ధమాకా.. 2026 జనవరి 26కి ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం!
Follow Us