/rtv/media/media_files/2025/09/22/chhattisgarh-cm-agrees-to-grant-noc-to-sammakka-sagar-project-2025-09-22-21-20-28.jpg)
Chhattisgarh CM agrees to grant NOC to Sammakka Sagar Project
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్మాణానికి నిరభ్యంతర పత్రం(NOC) జారీ చేయాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌ను కలిశారు. ప్రాజెక్టు కోసం ఎన్‌ఓసీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిహారం అందజేస్తామని తెలిపారు. అలాగే సహాయక, పునరావాస చర్యలు చేపడతామంటూ హామీ ఇచ్చారు.
Also Read: దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. దీంతో ఉత్తమ్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలాఉండగా ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి NOCపై చర్చలు జరిపేందుకు తనకు సమయం ఇవ్వాలని విష్ణుదేవ్ ఉత్తమ్‌కు లేఖ రాశారు.
Also Read: కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వందల టన్నుల బియ్యం
తెలంగాణలో నీటి లభ్యతను పెంచడం కోసం గోదావరిపై 6.7 TMCల సామర్థ్యంతో సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు వెనుక జలాల వల్ల ఛత్తీస్‌గఢ్‌లో కొంత భాగం ముంపునకు గురికానుంది. ఈ క్రమంలో ముంపు ప్రాంతంలో భూసేకరణ, పరిహారం చెల్లించే దానిపై ఉత్తమ్ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. దీనిపై NOC జారీ చేసే విషయంలో ఇటీవల ఛత్తీస్‌గఢ్ సీఎంకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే విష్ణుదేవ్ సాయి ప్రాజెక్టు NOCకి ఆమోదం తెలిపారు.
Also Read: భార్యని కిరాతకంగా చంపి.. ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి ఒప్పుకున్న భర్త