/rtv/media/media_files/2025/08/03/78-students-given-anti-rabies-shots-after-stray-dog-contaminates-mid-day-meal-2025-08-03-17-03-54.jpg)
78 students given anti rabies shots after stray dog contaminates mid-day meal
ఛత్తీస్‌గఢ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కలు తిన్న ఆహారం, సగం తిని వదిలేసిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం పెట్టడం దుమారం రేపింది. విషయం తెలియడంతో ముందుజాగ్రత్తగా విద్యార్థులకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారు. జులై 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని బలోదా బజార్ లచన్‌పూర్ అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో వంటగది సమీపంలో కూరగాయలు నిల్వఉంచారు. వాటిని వీధి కుక్కలు నాకాయి. మరికొన్నింటిని సగం తిని వదిలేశాయి.
Also Read: అక్కడ 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు.. ఎన్నికల సంఘంపై చిదంబరం విమర్శలు
వాటిని చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారు వంట మనుషులకు హెచ్చరించారు. అయినా కూడా వంట మనుషులు ఆ కురగాయాలు ఉడకనివని చెప్పి బుకాయించారు. వాటితోనే విద్యార్థులకు వడ్డించారు. ఇంటికి వెళ్లిన తర్వాత విద్యార్థులు జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానికంగా ఈ అంశం సంచలనం రేపింది. చివరికి తల్లిదండ్రులు, గ్రామస్థులు.. ఉపాధ్యాయులకు అలాగే పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జలేంద్ర సాహుకు ఫిర్యాదు చేశారు. అలాగే తమ పిల్లలను లచన్‌పూర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
Also Read: ఆరెంజ్ అలెర్ట్.. ఈ 55 జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు.. IMD హెచ్చరిక!
చివరికి వైద్యులు 78 మంది విద్యార్థులకు రేబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, ఉపాధ్యాయులు పాఠశాల వంట మనుషులను తొలగించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని కోరారు. అలాగే అక్కడి స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు ఎవరి ఆదేశాల మేరకు విద్యార్థులకు రేబిస్ టీకా ఇచ్చారని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్ దీపక్ నికుంజ్ పాలరి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలాఉండగా ఈమధ్య గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండా పాడైపోయిన కూరగాయలు, గుడ్లు, ఇతర పదార్థాలతో వంటలు చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అలాగే మరికొన్ని చోట్ల వంట పాత్రలు, విద్యార్థులు తినే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం లేదు. కలుషితమైన నీటినే వంటకు, తాగడానికి వినియోగించడం వల్ల ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. క్యాప్‌జెమినీ కంపెనీలో 45,000 జాబ్స్