'I Love You' చెప్పడం లైంగిక వేధింపు కాదు.. కోర్టు సంచలన తీర్పు

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికకు I Love You చెప్పడం లైంగిక వేధింపు కేసుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు తీర్పును జస్టిస్ సంజయ్ ఎస్‌ అగర్వాల్ నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం సమర్థించింది.

New Update
Saying 'I Love You' To Minor Girl Not Sexual Harassment, Chhattisgarh High Court

Saying 'I Love You' To Minor Girl Not Sexual Harassment, Chhattisgarh High Court

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికకు I Love You చెప్పడం లైంగిక వేధింపు కేసుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు తీర్పును జస్టిస్ సంజయ్ ఎస్‌ అగర్వాల్ నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం సమర్థించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌నుు న్యాయస్థానం తిరస్కరించింది. చివరికి పోక్సో చట్టం కింద కేసు నమోదైన యువకుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.  

Also Read: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. 20 వాహనాలు ధ్వంసం

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఓ 15 ఏళ్ల విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలోనే ఓ యువకుడు ఆమెకు ఐ లవ్‌ యూ చెప్పాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిపై ఐపీసీ 354డీ, 509, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8, ఎస్సీ-ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 3(2) కింద కేసు నమోదు చేశారు.

Also Read: మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు

 దీంతో బాధిత యువకుడు ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టు ఐ లవ్‌ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. దీంతో ఆ బాలిక కుటుంబం హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ జరిగిన న్యాయస్థానం ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.  ఐ లవ్‌ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు