🔴Live Breakings: వన్డేలకు రిటైర్మెంట్ పక్రటించిన మాక్స్వెల్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాక్స్వెల్ చివరిగా 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు, ఇందులో ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్లో ఓడిపోయింది.
శ్రేయాస్ అయ్యర్ సంపాదనపై ఓ న్యూస్ వైరల్‌గా మారింది. అతడి నెట్‌వర్త్ రూ.60 కోట్ల-రూ.70కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. ముంబైలోని లోధా వరల్డ్ టవర్‌లో రూ.11.85 కోట్ల విలువైన 4BHK అపార్ట్మెంట్ ఉంది. మెర్సిడెస్ బెంజ్, లంబోర్ఘిని హురికెన్ లగ్జరీ కార్లు ఉన్నాయి.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. 2020లో ఢిల్లీ, 2024 కోల్‌కతా, ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్ లో ముంబైను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 206 పరుగులు టార్గెట్ ఇవ్వగా దాన్ని పంజాబ్ 19 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ మంగళవారం ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతోంది.
ఐపీఎల్ సీజన్ 18లో క్వాలిఫయర్ 2లో పంజాబ్, ముంబై తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో లేట్ గా ప్రారంభం అయింది. ఇందులో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫయర్ 2 లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో ఆర్సీబీతో తలపడనుంది.
క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ MP ప్రియ సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. జూన్ 8న నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. నవంబర్ 18న వారణాసిలోని ఒక పెద్ద హోటల్లో గ్రాండ్‌గా వివాహం జరగనుందని తెలుస్తోంది.