/rtv/media/media_files/2025/09/28/asia-cup-2025-prize-money-2025-09-28-16-52-50.jpg)
Asia Cup 2025 Prize Money
మరికొద్ది గంటల్లో భారత్ vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల్ క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తోన్నారు. ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ తలపడటం ఇది మూడోసారి. ఇప్పటికి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీం ఇండియా రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్‌పై విజయం సాధించింది. అది మాత్రమే కాకుండా ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోలేదు.
Asia Cup 2025 Prize Money
ఇప్పుడు కూడా ఫైనల్‌లో పాకిస్థాన్‌ను హ్యాట్రిక్‌గా ఓడించి టైటిల్ గెలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు భారత్‌తో గత రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన పాక్ ఈసారి ఫైనల్ పోరులో గెలిచి టైటిల్ సొంతం చేసుకుని తమ అభిమానుల కోపాన్ని తగ్గించాలని చూస్తోంది. ఇదంతా ఒకే కానీ.. ఈ ఆసియా కప్ 2025 టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌లో గెలిపొందిన జట్టుకు, అలాగే రన్నరప్‌కు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది? అనేది ఇప్పుడు అందరిలోనూ తొలుస్తున్న ప్రశ్న. అందువల్ల ఫైనల్ గెలిచిన జట్టుకు ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా కప్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న జట్టుకు సుమారు $300,000 (సుమారు రూ.2.6 కోట్లు) ప్రైజ్ మనీ లభించే అవకాశం ఉంది.
ఫైనల్‌లో ఓడిపోయిన రన్నరప్ జట్టుకు సుమారు $150,000 (సుమారు రూ.1.3 కోట్లు) దక్కుతుంది.
మూడవ స్థానంలో ఉన్న జట్టుకు రూ.80 లక్షలు చెల్లిస్తారు.
నాల్గవ స్థానంలో ఉన్న జట్టుకు రూ.60 లక్షలు ఇవ్వనున్నారు.
గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 50 శాతం వరకు పెంచారు.
2025 Asia Cup టీం ఇండియాకు ఒక అద్భుతమైన సంవత్సరం అనే చెప్పుకోవాలి. భారత జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. వాటన్నింటినీ గెలుచుకుంది. ఇప్పుడు టీం ఇండియా వరుసగా ఏడో మ్యాచ్‌ను గెలిచి 2025 ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఆసియా కప్ చరిత్రలో టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.