/rtv/media/media_files/2025/09/28/asia-cup-2025-hardik-pandya-ruled-out-of-final-match-against-pakistan-2025-09-28-14-45-05.jpg)
Asia Cup 2025 Hardik Pandya ruled out of final match against Pakistan
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో india vs pakistan మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ ప్రియులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తు్న్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీం ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. పాక్‌తో ఫైనల్ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా దూరం అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26న శ్రీలంకతో టీం ఇండియా తన చివరి మ్యాచ్ ఆడింది.
IND Vs Pak Asia Cup 2025
అక్కడ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తొలి ఓవర్ వేసిన తర్వాత అతను మైదానం నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ మైదానంలోకి రాలేదు. దీంతో అతడు గాయపడ్డాడని తెలిసింది. మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ.. హార్దిక్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని.. అందువల్లనే అతను మైదానం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయినప్పటికీ అతని ఫిట్‌నెస్ గురించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్‌లో టెన్షన్ పెరిగింది.
Hardik Pandya missing out tomorrow will be a huge loss. I would play a half fit pandya as he is our OG player, clutch god, man of the big occasions. Stay strong & fit - Kung Fu Pandya💥 pic.twitter.com/dVPnRdZW0f
— Akshat (@Akshatgoel1408) September 27, 2025
ఇంతకీ హార్దిక్ ఆడతాడా లేదా అనే దానిపై అప్‌డేట్ లేకపోవడంతో ఇది ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాకు టెన్షన్‌ను పెంచింది. అదే సమయంలో మరొక పెద్ద ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. హార్దిక్ పాండ్యా గాయం మరింత తీవ్రంగా ఉండి.. అతను ఫైనల్‌కు దూరమైతే.. అతని స్థానంలో ఎవరు ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటారు? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. శ్రీలంకతో మ్యాచ్‌లో శివమ్ దుబే దూరం అయ్యాడు. ఇప్పుడు పాక్‌తో ఫైనల్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో అతడు ఒక ఆటగాడిగా ఉన్నాడు. కాబట్టి టీమ్ ఇండియా ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.
అందువల్ల హార్దిక్ స్థానంలో తీసుకుంటే అర్ష్ దీప్ సింగ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అర్ష్‌దీప్ సింగ్ చివరిసారిగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. మరీ ముఖ్యంగా సూపర్ ఓవర్‌లో తన బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేసి టీమిండియాను గెలిపించాడు. అందువల్ల ఇప్పుడు హార్దిక్ ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయితే.. ఆ ప్లేస్‌ను అర్ష్ దీప్ భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీలంకతో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా సైతం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.