/rtv/media/media_files/2025/09/27/abhiskek-hardhik-2025-09-27-09-36-14.jpg)
ఆసియా కప్(Asia cup 2025) లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా ఫైనల్స్(Team India Finals) కు వచ్చింది. ప్రతీ మ్యాచ్ లోనూ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. రేపు పాకిస్తాన్(pakistan) తో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. ఇప్పటి వరకు ఆ టీమ్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో భారత్ గెలిచింది. ఈ రెండిటిలోనూ పాకిస్తాన్ ఎక్కడా టీమ్ ఇండియాకు పోటీను కూడా ఇవ్వలేకపోయింది. ఈ లెక్కడన రేపటి మ్యాచ్ లో కూడా విజయవకాశాలు భారత్ వైపే ఉన్నాయి.
Also Read : శ్రీలంకతో సూపర్ ఓవర్.. అద్భుతమైన బౌలింగ్ తో గెలిపించిన అర్షదీప్
అభిషేక్, హార్దిక్ కు గాయాలు..
అయితే ప్రస్తుతం టీమ్ ఇండియా(team-india) ను గాయాల బెదడ బాగా భయపెడుతోంది. వీటి కారణంగా ఫైనల్మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్లు దూరం అవ్వచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతుతున్నాయి. ఇద్దరూ కూడా చాలా ముఖ్యమైన ప్లేయర్లే కావడం గమనార్హం. ఆసియా కప్ లో దుమ్ము లేపుతున్న బ్యాటర్ అభిషేక్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలు గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న భారత జట్టు శ్రీలంకతో చివరి మ్యాచ్ ఆడింది. ఇందులో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో కూడా అభిషేక్ దుళ్ళగొట్టేశాడు. కానీ తరువాత ఫీల్డింగ్ కు మాత్రం రాలేదు. అలాగే హార్దిక్ పాండ్యా(hardhik-pandya) కూడా ఒక్క ఓవరే వేశాడు. అందులో ఒక వికెట్కూడా తీశాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్ కు రాలేదు. ఇద్దరికీ గాయాలు అయ్యాయని అందుకే ఆట మధ్యలో వెళ్ళిపోయారని అంటున్నారు.
ప్రస్తుతం భారత జట్టులో నిలకడగా పరుగులు కొడుతూ ప్రతీ మ్యాచ్ లో హైలెట్ గా నిలుస్తున్నాడు అభిషేక్ శర్మ(abhishek-sharma). ఒకవేళ రేపటి మ్యాచ్ లో అతను రాకపోతే కనుక పాక్ జట్టుకు అదనపు బలం చేకూరినట్టవుతుంది. కానీ ఇద్దరివీ అంత పెద్ద గాయాలు కాదని...ఇప్పటికైతే సమస్య లేదని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పారు. శనివారం ఫిట్నెస్ పై ఓ అంచనాకు వస్తామని అన్నారు. దుబాయ్వాతావరణం వల్ల హార్దిక్ కండరాలు పట్టేశాయని..అభిషేక్ కూడా క్రాంప్స్ తో బాధపడుతున్నాడని చెప్పారు. కానీ ఫ:నల్ల మ్యాచ్ కు తప్పకుండా అందుబాటులో ఉంటారని మోర్కెల్ తెలిపారు. ఇంక మ్యాచ్ కు ఒక్కరోజే ఉంది కాబట్టి...ఈరోజు అంతా వాళ్ళు రెస్ట్ లోనే ఉంటారు. మసాజ్ సెషన్స్ లో పాల్గొంటారు. ఆటగాళ్ళు వరుసగా మ్యాచ్ లు ఆడుతూ వస్తున్నారు. వాళ్ళు రిలాక్స్ కావాలి. ఈ ఒక్క రోజు అది వాళ్ళకు దక్కుతుందని మోర్కెల్ చెప్పారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
Also Read: Elon Musk: ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్...ఎపిస్టీన్ ఫైల్స్ లో బిలయనీర్ పేరు