బాక్సర్ మేరీ కోమ్ ఇంట్లో చోరీ.. సీసీఫుటేజ్‌లో షాకింగ్ విజువల్స్

ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ నివాసంలో దొంగతనం జరిగింది. హర్యానా ఫరీదాబాద్‌లోని ఆమె ఇంట్లో విలువైన వస్తువులతో పాటు టీవీని దొంగిలించారు దుండగులు.

New Update
Boxer Mary Kom

ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ నివాసంలో దొంగతనం జరిగింది. హర్యానా ఫరీదాబాద్‌లోని ఆమె ఇంట్లో విలువైన వస్తువులతో పాటు టీవీని దొంగిలించారు దుండగులు. ఫరీదాబాద్ సెక్టార్ 46లో మేరీ కోమ్‌‌కు చెందిన 'ఇబెనెసర్ ఇన్' అనే రెండు అంతస్తుల బంగ్లాలో చోరీ జరిగింది. మేరీ కోమ్ ఓ మారథాన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు మేఘాలయకు వెళ్లడంతో, ఇల్లుకు కొన్ని రోజులుగా తాళం వేసి ఉంది. సెప్టెంబర్ 24న ఈ చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీలో

శనివారం మేరీ కోమ్  వారు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు విలువైన వస్తువులను భుజాలపై మోసుకుని పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. దొంగలు మొదటి అంతస్తు బాల్కనీ నుండి డోర్‌ను పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో దొంగ టీవీని తన భుజాలపై మోసుకువెళ్తుండగా, మరో ముగ్గురు దొంగలు దుప్పట్లో చుట్టిన ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్తున్నట్లు రికార్డ్ అయింది. మరో వ్యక్తి స్కూటర్‌పై వారిని ఫ్యాలో అవుతున్నట్లు కూడా గుర్తించారు. చోరీకి గురైన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా.

ఈ ఘటనపై మేరీ కోమ్ స్పందిస్తూ, "నేను ఇంటికి చేరుకున్నాక పూర్తి వివరాలు తెలుసుకుంటాను. సీసీటీవీ ఫుటేజీలో వారు టీవీతో పాటు ఇతర వస్తువులను తీసుకెళ్తున్నట్లు కనిపించిందని నా పొరుగువారు చెప్పారు. సెప్టెంబర్ 24న ఈ ఘటన జరిగిందని తెలిపారు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను" అని చెప్పారు. ఈ చోరీ కేసుపై ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, దొంగలను పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Advertisment
తాజా కథనాలు