/rtv/media/media_files/2025/09/28/pakistan-cricket-fans-warning-her-team-2025-09-28-15-21-32.jpg)
pakistan cricket fans warning her team
Asia Cup 2025 ఫైనల్‌లో టీం ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. 41 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ టైటిల్ మ్యాచ్‌లో భారత్ vs పాకిస్తాన్ తలపడటం ఇదే తొలిసారి కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దుబాయ్ వేదికగా india vs pakistan మధ్య జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఆటగాళ్లే కాదు.. అభిమానులు సైతం ఈ మ్యాచ్‌ను ఒక యుద్ధంలా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పాక్ అభిమానులు తమ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్‌పై ఓడిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తమ జట్టును హెచ్చరించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇప్పటి వరకు ఈ ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్తాన్.. భారత్ చేతిలో రెండు సార్లు ఘోర పరాజయాలను చవిచూసింది. దీంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ పాక్ జట్టుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్‌లో కూడా ఓడిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దేశానికి తిరిగి రావద్దని కొందరు అభిమానులు తమ జట్టుకు సోషల్ మీడియాల్లో, మీడియా ఇంటర్వ్యూలలో వార్నింగ్ ఇస్తున్నారు.
దేశానికి రావొద్దు
‘‘మరోసారి భారత్ చేతిలో ఓడిపోతే, మీరు పాకిస్తాన్‌కు తిరిగి రావద్దు. ఆ ఫ్లైట్ టికెట్‌ను అక్కడే చించేయండి. ఇక్కడికి వస్తే అభిమానుల ఆగ్రహాన్ని తట్టుకోలేరు’’ అంటూ ఒక అభిమాని వీడియోలో చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
అదే సమయంలో మరొక అభిమాని మాట్లాడుతూ.. ‘‘మా కలను నాశనం చేయొద్దు.. ఈ ఫైనల్‌ను పాకిస్తాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భారత్‌పై మాకు విజయం కావాలి. లక్షల మంది అభిమానుల కలలను మీరు మరోసారి నాశనం చేయొద్దు’’ అంటూ మరొక పాకిస్తాన్ అభిమాని భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతలో ఇంకొకరు సోషల్ మీడియా వేదికగా.. ‘‘క్రికెట్ అంటే ఇక్కడ ఉద్వేగం. క్రికెట్‌ను పాకిస్తాన్‌లో ఒక ఉద్వేగంగా చూస్తారు. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆశిస్తారు. అందువల్ల పరాజయం పాలైన ప్రతిసారీ ఆటగాళ్లపై కోపం కట్టలు తెంచుకుంటోంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా తొలిసారి ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఇప్పటికే భారత్ రెండుసార్లు పాక్‌ను ఓడించింది. దీంతో పాక్ జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది. ఎలాగైనా ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌లో గెలిచి తమ అభిమానులకు గిఫ్ట్‌గా ఇవ్వాలని పాక్ జట్టు భావిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.