/rtv/media/media_files/2025/09/28/asia-cup-2025-2025-09-28-09-42-20.jpg)
Asia cup 2025
ఆసియా కప్ 2025(Asia Cup 2025 Final) లో భాగంగా నేడు భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్(IND vs PAK Final) జరగనుంది. టైటిల్ కోసం రెండు జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు భారత్, పాకిస్తాన్ తలపడగా.. టీమిండియానే రెండుసార్లు గెలిచింది. అయితే మరోసారి నేడు టైటిల్ కోసం ఢీకొనేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భారత్, పాక్ రెండు జట్లు చూస్తున్నాయి. భారత్‌తో మ్యాచ్ అంటే పాక్ ఆటగాళ్లు కూడా భయపడుతున్నారు. ఈక్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడారు. టీమ్‌ఇండియాతో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. ఇంతకు ముందు రెండు మ్యాచ్‌ల్లో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ కాకుండా చేస్తామని తెలిపారు. భారత్ చేతిలో పాక్ రెండు సార్లు ఓడిపోగా.. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ భావిస్తోంది.
ఇది కూడా చూడండి: IND Vs PAK Final Match: పాక్‌తో ఫైనల్.. టీమిండియా జట్టులోకి ఇద్దరు బడా ప్లేయర్లు రీఎంట్రీ..!
Pakistan captain Salman Ali Agha slams Indian team for avoiding handshakes#TOKInAsiaCup#PAKvINDpic.twitter.com/vc117OqCRG
— TOK Sports (@TOKSports021) September 27, 2025
మ్యాచ్ ఫ్రీగా చూసే అవకాశం
ఈ ఫైనల్ మ్యాచ్‌ను మొబైల్స్‌లో ఉచితంగా చూసే అవకాశం ఉంది. జియో యూజర్లు ఉచిత SonyLIV, ZEE5 వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను అందించే ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. రూ. 445 రీచార్జ్ చేసి 56 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, SonyLIV, ZEE5 సహా ఇతర OTT ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. రూ.175 రీఛార్జ్‌తో 28 రోజుల పాటు 10GB డేటాతో పాటు SonyLIV సహా 10 OTT యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 1049 రీఛార్జ్‌తో 84 రోజుల పాటు రోజుకు 2GB డేటాతో పాటు SonyLIV, ZEE5, JioTV వంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభిస్తాయి. ఇలా మీరు ఉచితంగా మ్యాచ్ చూడవచ్చు.
ఇది కూడా చూడండి: IND Vs PAK Final Match: భారత్ - పాక్ ఫైనల్ మ్యాచ్.. ఫ్రీగా చూసే అద్భుత అవకాశం - ఎక్కడంటే?