IND Vs PAK Final Match: పాక్‌తో ఫైనల్.. టీమిండియా జట్టులోకి ఇద్దరు బడా ప్లేయర్లు రీఎంట్రీ..!

ఆసియా కప్ ఫైనల్ కోసం భారత జట్టులోకి పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా, ఆల్-రౌండర్ శివమ్ దూబే తిరిగి రానున్నారు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వీరికి విశ్రాంతి ఇవ్వగా.. రేపు పాకిస్తాన్‌తో జరగనున్న టైటిల్ పోరుకు మళ్లీ తుది జట్టులో చేరే అవకాశం ఉంది.

New Update
IND Vs PAK Final Match

IND Vs PAK Final Match

2025 ఆసియా కప్ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. సెప్టెంబర్ 28వ తేదీన భారత్ vs పాకిస్తాన్ (india vs pakistan) దుబాయ్ వేదికగా ఆఖరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ రెండు దేశాల జట్ల మధ్య ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా రెండూ గెలిచింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో హాట్రిక్‌గా పాక్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు పాక్ జట్టు సైతం టైటిల్ కోసం పోరాడుతూ ఫైనల్‌కు చేరుకుంది. ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని పాక్ భావిస్తోంది. 

IND Vs PAK Final Match

ఇక ఈ ఇరు జట్ల మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టులోని ఆటగాళ్లు గాయాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. 

పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్‌కు టీమిండియా కెప్టెన్ సూర్య కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ శివం దుబే తిరిగి ప్లేయింగ్ XIలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌కు వీరిద్దరికీ విశ్రాంతి ఇవ్వగా.. వీరి ప్లేస్‌లో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్నారు. ఇందులో హర్షిత్ రాణా ప్రదర్శన అత్యంత పేలవంగా కనిపించింది. దీంతో అతడి తొలగింపు ఖాయమనే అనిపిస్తోంది. ఇక సూపర్ ఓవర్‌తో సహా అర్ష్‌దీప్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. అందువల్ల అతన్ని తప్పించడం అంత మంచి ఆప్షన్ కాదని క్రికెట్ ప్రియులు భావిస్తున్నారు.

ఇక భారత్ పాత సెంటిమెంట్‌నే ఫాలో కావాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్‌తో జరిగిన గత రెండు మ్యాచ్‌లలో భారత జట్టు చాలా అద్భుతంగా ఆడింది. రెండింటినీ గెలుచుకుంది. కాబట్టి అదే జట్టును మార్చడం కూడా సరికాదని కొందరు చెబుతున్నారు. అందువల్ల ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌కు హార్దిక్ కూడా సరిపోతాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నిన్న (సెప్టెంబర్ 26)న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడు ఫీల్డింగ్ చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా ఫీల్డింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అనంతరం గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ ఇద్దరు ప్లేయర్ల గాయలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించాయి. ఎందుకంటే వీరిద్దరూ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంతో కీలకం. తాజాగా వీరి హెల్త్ అప్డేట్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ వెల్లడించారు. 

అభిషేక్ శర్మ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే హార్దిక్ పాండ్యా గాయాన్ని అంచనా వేస్తున్నామని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. హార్దిక్ గాయం తీవ్రంగా ఉంటే, టీమ్ ఇండియా టెన్షన్ పెరిగే అవకాశం ఉంది.

ఫైనల్‌కు భారత్ ఆడుతున్న 11: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

Advertisment
తాజా కథనాలు