/rtv/media/media_files/2025/01/22/zOYihBH0zPEiSvaztrlN.jpg)
Abhishek Varma
నేడు ఆసియా కప్ 2025(Asia cup 2025) లో భాగంగా భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్(IND vs PAK Final Match) జరగనుంది. రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) మ్యాచ్ గురించి అసలు భయపడక్కర్లేదని అన్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ(abhishek-sharma) అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో అభిషేక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ 4లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి బ్యాటింగ్ చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాడు. అభిషేక్ ఆరు మ్యాచ్‌ల్లో 51.50 సగటు, 204.63 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశాడు. టోర్నమెంట్ సమయంలో అభిషేక్ అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ తగ్గింది.
ఇది కూడా చూడండి: Asia Cup 2025 IND vs PAK Final match: నేడే భారత్ vs పాక్ ఫైనల్ మ్యాచ్.. భయపడుతున్న పాక్ ఆటగాళ్లు!
What if Abhishek Sharma fails in Asia Cup final? THIS is what Gavaskar suggests#sunilgavaskar#indvsslasiacup2025#indvssl#indvspak#indvspakasiacup2025#indiavspakistanasiacup2025#asiacup2025#asiacupcricketpic.twitter.com/vVEis9BXsU
— Sports Today (@SportsTodayofc) September 27, 2025
ఇది కూడా చూడండి:Asia Cup 2025 IND vs PAK Final match: పాక్‌తో తలపడే భారత్ ఫైనల్ జట్టు ఇదే?
మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్..
అభిషేక్ శర్మ ఔట్ అయితే భారత్ ఇబ్బందుల్లో పడుతుందని షోయబ్ అక్తర్ అన్నారు. అయితే ఈ విషయంపై సునీల్ గవాస్కర్ అన్నారు. అభిషేక్ వర్మ మాత్రమే కాకుండా శుభమన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ కూడా అదరగొడతారని అన్నారు. బ్యాటింగ్ ఫైర్ ఉందని, అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఫామ్‌లో ఉన్న అభిషేక్ అవకాశాలను జారవిడుచుకోడని, పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్‌లో కూడా పెద్ద సెంచరీ చేస్తాడనే నమ్మకం ఉందని గవాస్కర్ అన్నాడు. మూడు అర్ధ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దురదృష్టకర రనౌట్ కారణంగా అతను సెంచరీ కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ, అతను మరో పెద్ద ఇన్నింగ్స్ కోసం గురిపెట్టే అవకాశం ఉందని.. అది మూడు అంకెల స్కోర్ కావచ్చని గవాస్కర్ అన్నారు.