wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’
భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక మోహిత్ యాదవ్ సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. వరకట్న వేధింపులు కేసు పెడతామని బెదిరిస్తున్నారని వీడియోలు చెప్పాడు. తన చావుకు న్యాయం జరగకుంటే అస్తికలు డ్రైనేజీలో కలపాలని బందువులను కోరాడు.