మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

మహారాష్ట్ర పూణెలో దారుణం జరిగింది. భిగ్వాన్ హైవేపై తెల్లవారుజామున17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. టీ స్టాల్ వద్ద ఆగిన కారును బైక్‌పై వచ్చిన దుండగులు చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. తుపాకీలతో బెదిరించి లైంగిక దాడి చేశారు.

New Update
20bb8c77-6ec0-411e-9a53-ef91a26bbe11

Mumbai: మహారాష్ట్ర పూణెలో దారుణం జరిగింది. భిగ్వాన్ హైవేపై తెల్లవారుజామున17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. టీ స్టాల్ వద్ద ఆగిన కారును బైక్‌పై వచ్చిన దుండగులు చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. తుపాకీలతో బెదిరించి ఆమెను కారులోంచి బయటికి లాగి లైంగిక దాడి చేశారు. కారులో డ్రైవర్, ముగ్గురు మహిళలు, బాలిక, ఇద్దరు అబ్బాయిలను భయాందోళనకు గురిచేసి వారివద్దనున్న బంగారం నగలు దోచుకెళ్లారు.

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితులంతా జున్నార్ తెహ్‌సిల్ గ్రామానికి చెందినవారుగా వెల్లడించారు. సోలాపూర్‌లోని పండర్‌పూర్ దేవాలయానికి వెళ్తున్న కుటుంబంపై దుండగులు అటాక్ చేసినట్లు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్న 8 స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నట్లు తెలిపారు. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

ఇదిలా ఉంటే.. కర్నూల్‌ జిల్లాలో భయంకరమైన మర్డర్ జరిగింది. సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శేషన్న (54) అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి కొడవళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అనంతరం ఒక కాలు నరికి, దానిని బహిరంగంగాపట్టుకుని బైక్‌పై ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన భయంకరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కర్నూలు మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు