Sigachi Company: పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ప్రమాదంపై సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదం విషయంలో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడానికి యజమాన్యం అంగీకరించింది.పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది.

New Update
pashamylam

pashamylam

Sigachi Company : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ప్రమాదంపై సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదం విషయంలో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడానికి యజమాన్యం అంగీకరించింది.పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. 

Sigachi Chemical Factory

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్‌ కుమార్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై స్టాక్‌మార్కెట్లకు ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్‌ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. 3 నెలల వరకు ప్లాంట్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివేక్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి:Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు