Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బిహార్‌ వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చిన మైనర్‌ బాలిక.. వాటర్‌ బాటిల్‌ కొనుగోలు కోసం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Girl missing

Girl missing

 Missing girl : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బిహార్‌ వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చిన మైనర్‌ బాలిక.. వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. అయితే ఆమె రాకకోసం ఎదురు చూసినప్పటికీ ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినా  ఆచూకీ తెలియలేదు.

దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోపాలపురం పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రైల్వే స్టేషన్‌ సమీపంలోని  సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఆ బాలిక 5 వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఆల్ఫా హోటల్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు