గుండెపోటుకు కొవిడ్‌ వ్యాక్సిన్లతో సంబంధం లేదు: కేంద్రం

ఇటీవల కాలంలో దేశంలో ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్స్ కారణం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 40 ఏళ్ల లోపు వారుకూడా కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోతుండటంపై ICMR, AIMS పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లడించాయి.

New Update
Seven-year-old Kerala girl contracts rabies despite vaccination, admitted to hospital

Seven-year-old Kerala girl contracts rabies despite vaccination, admitted to hospital

Covid 19: ఇటీవల కాలంలో దేశంలో ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్స్ కారణం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 40 ఏళ్ల లోపు వారుకూడా కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోతుండటంపై ICMR, AIMS పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లడించాయి. అనారోగ్య సమస్యల ప్రభావం వల్లే ఆయా వ్యక్తుల చనిపోతున్నారని అధ్యయనాల నివేదికలు వెల్లడించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

వ్యాక్సిన్లతో సంబంధం లేదు..

ఈ మేరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆసుపత్రుల్లో సర్వే చేపట్టారు. 2021 అక్టోబరు నుంచి 2023 మార్చి మధ్య 18నుంచి 45 ఏళ్ల వయసు మృతుల డేటాను పరిశీలించాయి. ఈ ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ‘భారత్‌ కొవిడ్‌ వ్యాక్సిన్లు సురక్షితం. సమర్థవంతంగా పనిచేశాయి. దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో కనిపించాయి. గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు, జీవన శైలి, మునపటి అనారోగ్యాలే' అని అధ్యయనాలు వెల్లడించాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు