AP: జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు!
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.
షూటింగ్ టైమ్ లో తనతో నటుడు షైన్ టామ్ చాకో ఇబ్బందిగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ ఆరోపించారు. ఆ విషయమై నటికి ఇవాళ చాకో సూత్ర వాక్యం సినిమా ప్రచారంలో భాగంగా క్షమాపణలు చెప్పారు. విన్సీకి తాను ఎలాంటి హాని తలపెట్టాలని అనుకోలేదని అన్నారు.
కోల్‌కతాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. ఓ వ్యక్తి తన భార్యకు పెళ్లి రోజు సందర్భంగా రూ.49 వేల విలువైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. ఆమె దాన్ని ఒపెన్ చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ ఫోన్‌తో సైబర్ నేరాలు జరిగినట్లు చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తోన్న అధికార పార్టీ బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ లో మూడు రాఫెల్ జెట్లతో సహా 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాక్ ప్రకటించుకుంది. దీన్నిదసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ తోసిపుచ్చారు. భారత్ ఒక రాఫెల్‌ను మాత్రమే కోల్పోయిందని, అది కూడా సాంకేతిక లోపంతోనని తేల్చి చెప్పారు.
భారత్‌లో వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. అస్సాం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో భూంకపాలు రావడం కలకలం రేపింది.
టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను టీటీడీ సస్సెండ్ చేసింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని అధికారులు గుర్తించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహ డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీటెయిల్' మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు 'చంద్రముఖి' సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, లోబీపీతో బాధితులంతా ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.