BC Reservation : బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం...కొత్త జీవో వైపు అడుగులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తోన్న అధికార పార్టీ బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
 BC reservation in jobs

BC Reservation

BC Reservation:  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తోన్న అధికార పార్టీ బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న బీసీ రిజర్వేషన్ల పై ఇచ్చిన ఉత్తర్వులను సవరించి వాటిని 42 శాతానికి పెంచుతూ కొత్తగా జీవో  ఇవ్వాలని ఆలోచిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటద్దనే నిబంధన ఉంది.   

Also Read : తోడుంటాడని పెళ్లిచేసుకుంటే..రూ. 28 కోట్లు దోచుకున్నాడు..

ఇందులో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పోగా.. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించేలా గతంలో జీవోలు ఉన్నాయి. సుప్రీం నిబంధనతో పని లేకుండా...తాము బీసీల సామాజిక, ఆర్థిక సమాచారాన్నంతా సేకరించామని, కుల సర్వే నిర్వహించామని, తమ వద్ద ఉన్న సమాచారం (ఎంపిరికల్‌ డేటా) ఆధారంగా రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త జీవో జారీ చేసుకోవచ్చునని న్యాయనిపుణులు ప్రభుత్వానికి సూచించారని, దాని ప్రకారమే కొత్త జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన ప్రచారం సాగుతోంది. 

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

కుల సర్వే, డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు, దాని నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ ఈ జీవోను జారీ చేయాలని సర్కారు యోచిస్తోంది. దీనిపై ఈ నెల 10న జరిగే క్యాబినెట్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. క్యాబినెట్‌లో ఆమోదం లభిస్తే.. అవసరమైన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఎవరైనా న్యాయస్థానానికి వెళితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. 

Also Read : రేవంత్‌ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్‌ కీలకవ్యాఖ్యలు

మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం 30 రోజుల్లో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరించి గ్రామాలు, మునిసిపల్‌ వార్డులు, జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఎవరెవరికి ఏయే స్థానాలను రిజర్వ్‌ చేయాలనేది నిర్ణయిస్తుంది. దీనికి సమయం కూడా తక్కువే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.

Also Read: ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

Advertisment
Advertisment
తాజా కథనాలు