/rtv/media/media_files/2025/07/08/sorry-2025-07-08-22-11-20.jpg)
Dsara Villain Tom Chaco
దరా విలన్ షైన్ టామ్ చాకో మీద మలయాళ నటి లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. నటి విన్సీ సోనీ అలోషియస్ సినిమా సెట్స్ లో డ్రగ్స్ వినియోగించడమే కాక అతను తనపై లైంగిక దాడి కూడా చేశారని కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు విన్సీ ఫిర్యాదు చేశారు. సెట్స్ లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా మాట్లారని ఆమె చెబుతున్నారు. ఆ విషయాన్ని అప్పుడే దర్శకుడికి చెప్పానని...టామ్ చాకో ప్రవర్తనను మార్చుకోమని హెచ్చరించారని చెప్పుకొచ్చారు. సూత్రవాక్యం సెట్లో అతను తెల్లటి పౌడర్ నోట్లో నుంచి ఉమ్మి వేయడాన్ని చూశానని విన్సీ తెలిపారు.
ఎలాంటి హాని తలపెట్టాలని అనుకోలేదు..
ఈ సంఘటనపై చాకో ఈరోజు నట విన్సీకి క్షమాపణలు చెప్పారు. సూత్రవాక్యం సినిమా ప్రమోషన్స్ లో ఆయన అందరి ముందూ సారీ చెప్పారు. జరిగిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. అది కావాలని చేసింది కాని..సరదాగా చెప్పానని అన్నారు. విన్సీకి ఎటువంటి హాని తలపెట్టాలని అనుకోలేదని చెప్పుకొచ్చారు. విన్సీ కూడా అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఉంది. ఎవరో ఆమెను ప్రోత్సహించారని చాకో అన్నారు. దీని తరువాత నటి విన్సీ కూడా మాట్లాడారు. ఆ సమయంలో తనకు ఇబ్బందకలిగిందని...అయితే దానిపై తాను స్పందించిన తీరు చాకో కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఇప్పుడు ఆ వివాదం ముగిసిపోయిందని చెప్పారు. చాకోలో మార్పు కనబడుతోందని..తన తప్పు తెలుసుకున్నారని విన్సీ అన్నారు.