/rtv/media/media_files/2025/07/08/kolkata-lawyer-gifted-wife-49000-rupees-phone-2025-07-08-21-35-54.jpg)
Kolkata Lawyer Gifted Wife 49,000 rupees Phone, Gujarat Cops Came Knocking Moment She Turned It On
కోల్‌కతాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. ఓ వ్యక్తి తన భార్యకు పెళ్లి రోజు సందర్భంగా రూ.49 వేల విలువైన మొబైల్ ఫోన్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి ఆమెకు ఇచ్చాడు. సంతోషంతో పొంగిపోయిన ఆమె మొబైల్‌ను ఆన్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు వాళ్ల ఇంటికి వచ్చి తలుపుకొట్టారు. వాళ్లని చూసిన దంపతులు షాకైపోయారు. పెళ్లిరోజు రాత్రి వాళ్లకి ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also read: యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోలకతాకు చెందిన ఓ న్యాయవాది తన పెళ్లి రోజు కానుకగా.. భార్యకు రూ.49 వేలు పెట్టి ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. దాన్ని భార్య ఒపెన్ చేయగానే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అది కూడా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన పోలీసులు వాళ్ల ఇంటికి వచ్చారు. ఆ దంపతులు పోలీసులను చూసి షాకైపోయారు. ఆ ఫోన్‌తో సైబర్ నేరాలు జరిగాయని పోలీసులు చెప్పడంతో వారు భయపడిపోయారు.
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
తాము ఈరోజే మొబైల్ షాపు నుంచి ఈ ఫోన్ కొన్నామని.. తమకు ఏ నేరంతో సంబంధం లేదని తెలిపారు. చివరికి అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆ మొబైల్ షాపుపై రైడ్ చేశారు. ఆ షాపులోని డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగా ఉండటంతో మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్లని విచారిస్తున్నారు. పెళ్లి రోజు సంతోషంగా గడుపుదామనుకున్న ఆ న్యాయవాది దంపతులకు షాకింగ్ అనుభవం ఎదురైంది.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్