/rtv/media/media_files/2025/07/08/11-people-fell-ill-after-drinking-adulterated-toddy-2025-07-08-20-20-41.jpg)
11 people fell ill after drinking adulterated toddy
కల్తీ కల్లు తాగిన వారి ప్రాణాలు హరిస్తుంది. అయినా అధికారుల నీడలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వ్యసనానికి అలవాటు పడిన ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. కాలకూట విషాన్ని పేదల శరీరాల్లోకి నింపి డబ్బులు దండుకుంటున్నారు. చాలామంది మత్తు పదార్థాలు కలిపిన కల్లు తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొందరు మానసికస్థితి కోల్పోతున్నారు. మరణాలు సంభవిస్తున్నాయి. నగరంలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నా ఎక్సైజ్‌శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల్లో కొందరు మామూళ్ల మత్తులో ముగిని తేలుతున్నారని ఆరోపణలున్నాయి.
Also Read : CRIME : ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి
Drinking Adulterated Toddy
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, లోబీపీతో బాధితులంతా ఆస్పత్రిలో చేరారు. కల్తీ కల్లు తాగిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా కల్తీ కల్లు ఘటనపై ఆస్పత్రి సిబ్బంది జీహెచ్‌ఎంసీ ఎంహెచ్‌వోకు సమాచారం అందించారు.
Also Read : Jwala Gutta: జ్వాలా గుత్తా పాపకు పేరు పెట్టిన అమీర్ ఖాన్! కన్నీళ్లతో ఫొటోలు వైరల్
కాగా నిబంధనల ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కల్లు దుకాణాలు తనిఖీ చేయాలి. నమూనాలను ప్రాథమికంగా పరీక్షించడానికి అధికారుల వద్ద మినీ కిట్లు ఉంటాయి. కానీ, ఎక్కడా నమూనాల ఫలితాలను బయటకు వెల్లడించడం లేదన్న విమర్శలున్నాయి. కాగా ప్రభుత్వం కల్తీ కల్లును నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read : KTR : రేవంత్ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్ కీలకవ్యాఖ్యలు
Also Read:Saiyami Kher: ఒకే ఏడాదిలో రెండుసార్లు.. ట్రయాథ్లాన్ రేస్ లో చరిత్ర సృష్టించిన తొలి నటి!
kukatpally news latest | kukatpally news | kukatpally crime today | kukatpally crime | kukatpally incident | kukatpally | toddy worker | toddy