/rtv/media/media_files/2025/07/08/indian-rafale-jet-was-hit-during-operation-sindoor-2025-07-08-21-03-00.jpg)
Indian Rafale jet was hit during Operation Sindoor
Operation Sindoor : పహల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై దాడిచేసిన విషయం తెలిసిందే. వాయుసేన రాఫెల్ జెట్లతో పాక్ పై విరుచుకుపడింది. ఈ క్రమంలో మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాక్ ప్రకటించుకుంది.
"Not a single 🇮🇳Indian Rafale jet was hit during Operation Sindoor - zero losses in combat. Only 1 technical issue, currently under investigation" - Dassault CEO Eric Trappier. pic.twitter.com/xn1Unqg901
— Ajay Kashyap (@EverythingAjay) July 8, 2025
Also Read : బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం...కొత్త జీవో వైపు అడుగులు
Operation Sindoor - Rafale Crashed
అయితే పాకిస్థాన్ చేసిన ఈ ప్రకటనను దసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఒక రాఫెల్‌ను మాత్రమే కోల్పోయిందని, అది కూడా ఎత్తైన ప్రాంతంలో సాంకేతిక లోపం తలెత్తడం కారణంగానే జరిగిందని స్పష్టత ఇచ్చారు. దీంతో పాకిస్థాన్ చేసిన ప్రకటన అబద్దమని తేలింది. మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు ప్రకటించుకున్న పాక్ దానికి తగిన ఎలాంటి సాక్ష్యాలను చూపించలేకపోయింది.
Also Read : KTR : రేవంత్ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్ కీలకవ్యాఖ్యలు
కాగా, తాజాగా ఈ విషయమై రాఫెల్ విమానాలను తయారు చేసే ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ దీన్ని ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవని తేల్చి చెప్పారు. ఒక రాఫెల్‌ను భారత్ కోల్పోయిందని, అది కూడా శత్రువు వల్ల కాదని అన్నారు. అదికూడా అధిక ఎత్తులో సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలిందని స్పష్టం చేశారు. స్పెక్టా ఎలక్ట్రానిక్ వార్‌వేర్ సిస్టంలో కూడా ఆపరేషన్ సింధూర్‌లో శత్రు పక్షాల చర్యలు ఎక్కడా రికార్డు కాలేదన్నారు. తమ విమానాల ఆపరేషన్లలో జరిగే నష్టాలను డస్సాల్ట్ ఎప్పుడూ దాచిపెట్టలేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read : తోడుంటాడని పెళ్లిచేసుకుంటే..రూ. 28 కోట్లు దోచుకున్నాడు..
Also Read : ఫోన్ బానిసత్వానికి గుడ్‌బై.. 'ది ఫోన్ షేప్డ్ స్లాబ్'తో కొత్త డిజిటల్ డిటాక్స్ ట్రెండ్!
rafale-marine | rafale fighter jet | rafale india | pakistan | operation sindoor air strike | india operation sindoor | Indian army-air force operation sindoor