Nayantara: మళ్ళీ చిక్కుల్లో నయనతార.. 5 కోట్లు చెల్లించాలని లీగల్ నోటీసులు

లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహ డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీటెయిల్' మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు 'చంద్రముఖి' సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.

New Update
nayantara wedding documentary controversy

nayantara wedding documentary controversy

లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహ డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీటెయిల్' మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు 'చంద్రముఖి' సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ విషయంలో డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్‌ స్టూడియో, నెట్‌ఫ్లిక్స్‌ కి లీగల్ నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

Also Read: Saiyami Kher: ఒకే ఏడాదిలో రెండుసార్లు.. ట్రయాథ్లాన్‌ రేస్ లో చరిత్ర సృష్టించిన తొలి నటి!

వివాదం ?

అయితే 2005లో విడుదలైన 'చంద్రముఖి' ఆడియో, వీడియో హక్కులు AP ఇంటర్నేషనల్ అనే సంస్థకు చెందినవి. కాగా, వారి నుంచి సరైన అనుమతి లేకుండా వివాహ డాక్యుమెంటరీలో కొన్ని క్లిప్ లు, తెర వెనుక దృశ్యాలను వాడుకోవడంపై మద్రాసు హై  కోర్టును ఆశ్రయించింది సదరు సంస్థ. అనుమతి లేకుండా తమ కంటెంట్ వాడినందుకు నష్టపరిహారం కింద  రూ. 5 కోట్లు చెల్లించాలని  పిటిషన్‌ వేసింది.  అంతేకాదు 'చంద్రముఖి'లోని ఏ ఫుటేజ్‌ను డాక్యుమెంటరీలో వాడకుండా శాశ్వత నిషేధం విధించాలని, ఇప్పటికే ఉన్న క్లిప్‌లను తొలగించాలని AP ఇంటర్నేషనల్ న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం.  దీనిపై సోమవారం  విచారణ జరిపిన న్యాయస్థానం మరో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని  డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్‌ స్టూడియో, నెట్‌ఫ్లిక్స్‌  కి  ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:Jwala Gutta: జ్వాలా గుత్తా పాపకు పేరు పెట్టిన అమీర్ ఖాన్! కన్నీళ్లతో ఫొటోలు వైరల్

గతంలోనూ ఇదే సమస్య..

ఇలాంటి వివాదం నయనతార డాక్యుమెంటరీకి కొత్తేమీ కాదు. గతంలో, నటుడు-నిర్మాత ధనుష్ కూడా తన సినిమా 'నానుమ్ రౌడీ దాన్' (2015) లోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ కోర్టులో పిటీషన్ వేశారు.  నష్టపరిహారం కింద రూ. 10 కోట్ల డిమాండ్ చేశారు.  ఆ సినిమా ద్వారానే నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమకథ మొదలైంది.

Also Read: Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు

Also Read:కల్తీ కల్లు తాగి.. 11 మంది స్పాట్‌లో...

nayanthara documentary netflix | chandramukhi | actress-nayanthara

Advertisment
Advertisment
తాజా కథనాలు