TTD AEO : టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబు సస్పెన్షన్

టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను టీటీడీ సస్సెండ్ చేసింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని అధికారులు గుర్తించారు.

New Update
ttd devotees

Tirumala Tirupati Devasthanams

TTD AEO : టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను టీటీడీ సస్సెండ్ చేసింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . దీనికి సంబంధించి అదే పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్‌ విభాగానికి కంప్లైంట్ చేశాడు. 

Also Read:Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు

Also Read :  బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం...కొత్త జీవో వైపు అడుగులు

TTD AEO Suspended

ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన  సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని టీటీడీ గుర్తించింది.ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : CRIME :  ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

Also Read :  మెగా డాటర్ న్యూ లుక్ అదిరింది! ఫొటోలు చూశారా

tirumala-tirupati-devasthanams | tirumala-tirupati-devasthanam | tirumala devasthanam | tirupati-tirumala

Advertisment
Advertisment
తాజా కథనాలు