/rtv/media/media_files/2025/05/19/VpyvPwl39iWa5S8dqHaE.jpg)
NSA Ajit Doval, Iranian counterpart discuss bilateral ties
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో భారత్ చర్చలు జరిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అలీ అక్బర్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. అలీ అక్బర్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. చాబహార్ పోర్ట్, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌పై చర్చించనున్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
NSA Ajit Doval
అలాగే ఇరాన్‌కు అన్ని సమయాల్లో భారత్ అండంగా ఉంటుందని అజిత్ దోవల్ హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇరుదేశాల మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇదిలాఉండగా భారత్-పాకిస్థాన్ మరోసారి ప్రత్యక్ష చర్చలు జరపి సమస్యలు పరిష్కరించుకోవాలని ఇప్పటికే అమెరికా, యూకే సూచనలు చేశాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.
Also Read: హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు
ఇదిలాఉండగా తాజాగా లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. ఉగ్ర సంస్థలో నియామకాలు, ఆర్థిక వ్యవహారాలు, లాజిస్టిక్స్, ఇండోనేపాల్ సరిహద్దులో ఆపరేటివ్ కదలికలు సంబంధించిన వ్యవహారాల్లో అతడు పాల్గొంటాడనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
india pak war | rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu | ajit doval blue star operation | NSA Ajit Doval Serious Warning To Pak