Global Contest: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి

కంటెంట్‌ క్రియేటర్ల కోసం టెలిగ్రామ్‌ అంతర్జాతీయ పోటీకి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ క్రియేటర్ల కోసం తొలిసారి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ కాంటెస్ట్‌లో గెలుపొందితే 50,000 డాలర్ల విలువల చేసే బహుమతులు అందజేస్తామని తెలిపింది.

New Update
Telegram

Telegram

Global Contest: కంటెంట్‌ క్రియేటర్ల కోసం టెలిగ్రామ్‌ అంతర్జాతీయ పోటీకి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ క్రియేటర్ల కోసం తొలిసారి అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ కాంటెస్ట్‌లో గెలుపొందితే 50,000 డాలర్లు (భారతకరెన్సీలో సుమారు రూ.42 లక్షలు) విలువల చేసే బహుమతులు అందజేస్తామని టెలిగ్రామ్‌ తెలిపింది. ఈ పోటీ ద్వారా తన మెసేజింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాలని టెలిగ్రామ్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా  గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొనేవారు టెలిగ్రామ్ అందించిన సాంకేతిక, వినూత్న ఫీచర్లను చాటి చెప్పే షార్ట్ వీడియోలు రూపొందించాల్సి ఉంటుంది.

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

Global Contest For Content Creators

టెలిగ్రామ్ సీఈఓ, సహ-సంస్థాపకుడు అయిన పావెల్ డ్యూరోవ్, తన అధికారిక చానెల్‌లో  దీనికి సంబంధించిన సమచారాన్ని పోస్ట్‌ చేశాడు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ టెలిగ్రామ్‌ పై వాట్సాప్ తప్పుడుప్రచారం నిర్వహించిందని ఆరోపించారు, “ఇకపై మంచి పద్దతిలో ఆడటం లేదు, గ్లవ్స్ తీయండి” అంటూ కాస్త గట్టిగానే ప్రతిస్పందించారు. అలాగే, వాట్సాప్ తరచుగా టెలిగ్రామ్ పరిచయం చేసిన ఫీచర్లను తక్కువ నాణ్యతతో అనుకరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

కాగా తమ టెలిగ్రామ్‌ మెసేజింగ్ టెక్నాలజీని మలుపు తిప్పిన ఫీచర్లను ఈ పోటీ సందర్భంగా హైలైట్ చేయాలని భావిస్తోంది. వీటిలో ఫైల్ షేరింగ్, చానెల్ బ్రాడ్‌కాస్టింగ్, కస్టమైజబుల్ ఇంటర్‌ఫేస్‌లు, బాట్ ఇంటిగ్రేషన్‌ వంటివన్ని మొదట టెలిగ్రామే ప్రవేశపెట్టిందని, ఆ తర్వాతే వాట్సా్ప్‌ వంటి ఇతర యాప్‌ లు వాటిని అనుకరించాయని ఆయన తెలిపారు.

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

కాగా.. మే 26, 2025 (గల్ఫ్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 11:59 వరకు) గడువును ఇచ్చారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చు. జూన్ 2025లో ఫలితాలను ప్రకటిస్తారు. ఇక ఇందులో ఒక్కో వీడియో గరిష్ట వ్యవధిని 180 సెకన్లుగా ఉండాలని, అదికూడా ఇంగ్లీష్ లో రూపొందించాలని తెలిపారు. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి వాటికి అనుకూలంగా ఉండేలా వాటిని రూపొందించాలని కోరారు. వీటిలో AI టూల్స్ కూడా సహాయంగా కూడా వాడుకోవడానికి అవకాశం ఉందన్నారు.

స్పష్టత, విజువల్ ఆకర్షణ, మీమ్‌ అర్హత, వైరల్ కావడానికి అనువుగా ఉండడం వంటి అంశాలను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తామని నిర్వహకులు తెలిపారు. ఇక పోటీలో పాల్గొనే వారు ఒక గ్రూపుగా కూడా పాల్గొనే అవకాశం ఉంది.  వ్యక్తిగతంగా కూడా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది. గెలిచినవారికి బహుమతులతో పాటు.  టెలిగ్రామ్ గ్లోబల్ యూజర్ బేస్‌లో గుర్తింపు లభిస్తుందని తెలిపింది.

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

 

telegram-ceo | telegram | digital-content-creators | global news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు