Gujarat: దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముగ్గురు పిల్లలకు విషం తాగించి, ఆ తర్వాత వాళ్ల తల్లిదండ్రులు కూడా విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు.