/rtv/media/media_files/2025/05/19/qwQE1dIC1KcfkCDzDp4n.jpg)
Jyothi Malhotra
భారత సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తూ గూఢచార్యం చేస్తున్న జ్యోతి మల్హోత్ర అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే హర్యానాకు చెందిన ఈమె జాడలు ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే అప్పటి గవర్నర్ తమిళసై పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి ఉన్నారు.
Also Read: మరో ఘోర అగ్నిప్రమాదం.. యజమాని సహా 8 మంది మృతి!
Youtuber Jyoti Malhotra In Hyderabad 2023
ఆ సమయంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేశారు. ఇటీవల గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరినైనా కలిశారా ? అక్కడ ఇంకా ఏమైన వీడియోలు తీశారా ? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read: పాక్ గూఢచారి.. యూట్యూబర్ మల్వోత్రా గురించి ఈ 5 విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!
భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు అందిస్తోందనే ఆరోపణపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్‌ఐ అధికారులను కలిసిన జ్యోతి.. ఆ తర్వాత షకీర్ , రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిసినట్లు సమాచారం.
Also Read: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు భయంకరమైన క్యాన్సర్
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
rtv-news | national-news | JYOTHI MALHOTRA | hyderabad | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu