Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాక్‌ హైకమిషన్ అధికారితో ఆమె సంప్రదింపులు జరిపినట్లు బయటపడింది.

New Update
Jyothi Malhotra Links with Pakistan Army, ISI officials

Jyothi Malhotra Links with Pakistan Army, ISI officials

భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థలకు అందిస్తోందనే ఆరోపణపై హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్‌ఐ అధికారులను కలిసిన జ్యోతి.. ఆ తర్వాత షకీర్‌ , రాణా షాబాజ్‌ అనే వ్యక్తులను కలిసినట్లు సమాచారం. 

Also Read: జ్యోతిపై పూరీ యూట్యూబర్‌ సంచలన కామెంట్స్.. వెలుగులోకి సంచలన విషయాలు

షకీర్‌ పేరును ఫోన్‌లో జాట్‌ రంధావా పేరుతో సేవ్ చేసుకుందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత స్నాప్‌చాట్‌, వాట్సాప్, టెలిగ్రామ్‌లో పాకిస్థాన్‌ వ్యక్తులతో జ్యోతి టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాకు సంబంధించిన కీలకమైన, సున్నతమైన సమాచారాన్ని ఆమె పాకిస్తాన్‌కు లీక్‌ చేసింది. పాక్‌ హైకమిషన్ అధికారి డానిష్‌తో కూడా జ్యోతి సంప్రదింపులు జరిగినట్లు తేలింది. అంతేకాదు పాక్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీప్‌ కూతురు, అలాగే మరియం నవాజ్‌తో కూడా ఆమెకు సంబధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా నవాజ్‌ షరీఫ్‌ను జ్యోతి కలిసినట్లు తెలుస్తోంది.  

Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!

ఇదిలాఉండగా ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన మరో యూట్యూబర్‌తో ఉన్న సంబంధంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతేడాది సెప్టెంబర్‌లోలో పూరీకి వచ్చారని.. అక్కడ మరో యూట్యూబర్‌ను కలిసినట్లు గుర్తించామని ఒడిశా పోలీసులు తెలిపారు. పూరీకి చెందిన ఆ యూట్యూబర్‌ ఇటీవల పాక్‌లోని కర్తర్‌పుర్‌ సాహిబ్‌ గురుద్వారాకు వెళ్లినట్లు చెప్పారు. 

Also Read: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

ఇక ఈ వ్యవహారంపై పూరీ యూట్యూబర్‌ ఇన్‌స్టాలో స్పందించారు. '' జ్యోతి నాకు స్నేహితురాలు మాత్రమే. నేను యూట్యూబ్‌ ద్వారానే కలిశాను. ఆమెపై వస్తున్న ఆరోపణల గురించి నాకు తెలియదు. జ్యోతి పాకిస్థాన్‌తో గూఢచర్యం చేస్తుందని తెలిస్తే ఆమెతో నేను కాంటాక్ట్‌లో ఉండేదాన్ని కాదు. ఏదైన దర్యాప్తు సంస్థ నన్ను విచారించాలనుకుంటే నేను సహకరిస్తాను. దేశమే అన్నిటికంటే గొప్పదని'' ఆమె పోస్ట్‌ చేశారు. 

 telugu-news | rtv-news | JYOTHI MALHOTRA

Advertisment
Advertisment