/rtv/media/media_files/2025/06/26/mule-bank-accounts-2025-06-26-20-18-52.jpg)
Operation Chakra-V
Operation Chakra-V : అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా ఝుళిపించింది. డిజిటల్ అరెస్టు స్కామ్ లు, మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలతో అమాయకులను దోచుకుని ఆ సొమ్మును దాచుకుంటూ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపింది.ఆపరేషన్ చక్ర-V పేరుతో దేశ వ్యాప్తంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. మొత్తం 5 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసింది. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై (మామూలు పౌరుల పేరుతో వారికి తెలియకుండానే సైబర్ క్రిమినల్స్ వాడే ఫేక్ అకౌంట్స్) ఉక్కుపాదం మోపుతోంది.
ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?
యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సీబీఐ ఈ ఆపరేషన్ను చేపట్టింది. దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది. ఈ సోదాల సందర్భంగా 9 మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)
ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ డివైజ్ లు, లావాదేవీల వివరాలు, బ్యాంకు ఖాతాల కేవైసీ పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరవడంలో సహాయం చేసిన మధ్యవర్తులతో సహా ఈ తరహా స్కామ్ లకు సహాయం చేస్తున్న కీలక వ్యక్తులను సీబీఐ గుర్తించింది. సైబర్ నేరాలు అరికట్టే విషయంలో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఇటువంటి నేరాల వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిందని సీబీఐ అదికారులు తెలిపారు. మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల ఖాతాల నుంచి వచ్చిన అక్రమ నిధులను బదిలీ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి ఈ మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ సైబర్ నేరాలతో కొందరు బ్యాంకు అధికారులు, ఏజెంట్లు కూడా కుమ్మక్కైనట్లు సీబీఐ భావిస్తోంది.
Also Read : ప్రియుడితో సుఖం.. కన్నబిడ్డలకు రసగుల్లాలో విషం కలిపి చంపేసిన తల్లి!