Kolkata Tragedy: కోల్కతా అత్యాచారం-హత్య కేసు.. మాజీ ప్రిన్సిపాల్ ఇంటిపై సీబీఐ దాడులు
కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఒకవైపు నిందితులకు పాలీగ్రాఫ్ పరీక్షల నిర్వహణ జరుపుతోంది. మరోవైపు ఈ ఉదయం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అతని సన్నిహితుల ఇళ్లపై దాడులు నిర్వహించింది.