/rtv/media/media_files/2025/03/31/hairhealthy10-659221.jpeg)
Hair health
ఈ మధ్య కాలంలో అమ్మాయిల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి చెందాలంటే తలకు ఈ ఆయిల్ రాయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆయిల్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: AP: వైఎస్ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
జుట్టు పెరిగేలా చేయడంలో..
ఆవాల నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇది జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే హెయిర్ ఫోలికల్స్, ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది. మస్టర్డ్ ఆయిల్‌లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
సాధారణంగా జుట్టుకు ఆవాల నూనెను అలాగే రాసుకుంటారు. అయితే ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసి జుట్టుకు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. జుట్టు వేగంగా పెరుగుతుంది. ఆవాల నూనెను తేలికగా వేడి చేసి జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. గంట నుంచి రెండు గంటల వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు పెరుగుదల ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
ఆవాల నూనెతో కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. హెయిర్ మాస్క్ చేయడానికి.. పెరుగులో ఆవాల నూనె కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. తలకు పట్టించిన తర్వాత అరగంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. దీంతో తల ఉపరితలంపై పేరుకుపోయిన చుండ్రు తొలిగిపోతుంది. వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
mustard-oil-benefits | hair-health | healthy life style | daily-life-style | human-life-style | women-life-style | latest health tips | latest-telugu-news | today-news-in-telugu | telugu-news