/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/flipkart-jpg.webp)
FlipKart
ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగుల పని విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు బైబై చెబుతూ, ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో ప్రవేశపెట్టిన ఈ వెసులుబాటును కంపెనీ తాజాగా రద్దు చేసింది.
సంస్థ అంతర్గత విధానాల్లో భాగంగా ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఫ్లిప్‌కార్ట్ దశలవారీగా రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానాన్ని తగ్గిస్తూ వస్తోంది. మొదట్లో సీనియర్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఆఫీసు హాజరును కఠినతరం చేశారు. అయితే, ఇప్పుడు ఈ నిబంధనను సంస్థలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు వర్తింపజేస్తున్నట్లు సమాచారం. గతంలో ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి విధులు నిర్వహించేవారు.
Also Read: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
FlipKart Mandates 5 Day Work In Week
కొత్త నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ వారానికి ఐదు రోజులు ఆఫీసుకు హాజరు కావాల్సిందే. అయితే, ఉద్యోగి చేసే పని స్వభావాన్ని బట్టి, పరిమిత సంఖ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు కొనసాగుతుందని ఓ ఉద్యోగి మీడియాకు తెలిపారు.
ఈ మార్పును ఫ్లిప్‌కార్ట్ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. క్షేత్రస్థాయి, ఆపరేషనల్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది అధిక శాతం ఎప్పటి నుంచో తమ కేటాయించిన ప్రదేశాల నుంచే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. కార్పొరేట్ ఉద్యోగులను కూడా గత ఏడాది కాలంగా క్రమంగా ఆపీసులకు వస్తున్నారని, దీనివల్ల మెరుగైన పనితీరు, సహకారం కనిపిస్తోందని తెలిపారు. "కార్యాలయాలకు తిరిగి రావడం ద్వారా, కొత్తగా చేరిన, ఇప్పటికే ఉన్న ఉద్యోగుల మధ్య బలమైన బంధాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని, ఉమ్మడి లక్ష్యంపై దృష్టిని పెంపొందించాలని మేము నిర్దేశించుకున్నాం" అని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
Also Read: America-Gunturu:టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!
ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ రంగంలోని ఇతర సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై పునరాలోచన చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌కు ప్రధాన పోటీదారు అయిన అమెజాన్ కూడా గత ఏడాదే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి నుంచి తమ కార్పొరేట్ ఉద్యోగులంతా వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
ముఖాముఖి సంభాషణలు, కలిసి పనిచేయడం ద్వారా నూతన ఆవిష్కరణలు, ఉత్పాదకత పెరుగుతాయని అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ అప్పట్లో నొక్కిచెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సీఈఓ మాట్ గార్మన్ కూడా, "ఆఫీసు వాతావరణంలో ఉత్తమంగా పనిచేయలేని వారు వేరే కంపెనీలను చూసుకోవచ్చు. మేం కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాలనుకున్నప్పుడు, కలిసి పనిచేయకుండా అది సాధ్యపడదని నేను గమనించాను" అని స్పష్టం చేశారు.
Also Read: Narendra Modi Tour : ఏపీకి ప్రధాని మోడీ.. ఆ రోజు ఆయన ఏం చేస్తారంటే?
telugu-news | office | work-from-home | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | national news in Telugu