AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

వైఎస్ జగన్ కు ఈడీ షాకిచ్చింది. క్విడ్ ప్రోకో కేసులు రీ స్టార్ చేసింది. దాంతో పాటూ దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సున్నపురాయి గనుల తవ్వకాల్లో  అక్రమాలు జరిగాయని గతంలో CBI చార్జిషీటు దాఖలుచేసింది.

New Update
jagan

జగన్ అక్రమాస్తుల కేసులను చాలా కాలం తర్వాత ఈడీ మళ్ళీ రీ యాక్టివేట్ చేసింది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్  కు చెందిన మొత్తంగా రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో  అక్రమాలు జరిగాయని సీబీఐ ఎప్పుడో చార్జిషీటు దాఖలుచేసింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని సీబీఐ తేల్చింది. ఇప్పుడు ఈ చార్జ్ షీట్ ఆధారంగా  ఈడీ కేసులు పెట్టింది. మనీ లాండరింగ్ జరిగిందని తేల్చిన ఈడీ  ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

సీబీఐ కేసు ఆధారంగా..

జగన్‌ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు, హవాలా రూపంలో నగదు పొందినట్లు ఈడీ గుర్తించింది. రూ.95కోట్లు రఘురాం సిమెంట్స్‌లో షేర్లు  పొందారు. ఇది తర్వాత భారతి సిమెంట్స్ గా మారింది. రూ.55కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు.  కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి  గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్‌ కేసు కీలకమైనది. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్‌కు 417 హెక్టార్ల భూమి కేటాయించారు. ఇందులో సున్నపు రాయి ఉంటుంది. ఈ భూములు కేటాయించినందుకు  జగన్‌కు సంబంధించిన సాక్షి మీడియా గ్రూప్ ,  ఇతర సంస్థలలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ కేసు పెట్టింది. దాల్మియా సిమెంట్స్ నుండి వచ్చిన పెట్టుబడులు అక్రమ ఆదాయంగా ఈడీ నిర్ణయించింది.

గతంలో  దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా తమపై ఉన్న కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు. 2021లో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా  వాయిదా కోరినందుకు హైకోర్టు రోజుకు రూ. 50,000 ఖర్చులు చెల్లించాలని పునీత్ దాల్మియాను ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ   ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ,  సీబీఐ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.  సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ చురుకుగా ముందుకు సాగడం లేదు.  అయితే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కేసుల దర్యాప్తులు ఆగిపోయాయి. ఇప్పుడు ఈడీ జోక్యంతో ఈ కేసులు మళ్ళీ ఊపందుకుంటాయని అంటున్నారు. 

 today-latest-news-in-telugu | ys-jagan | ed | illegal | assets

Also Read: Russia: మస్క్ లాంటి వారు చాలా అరుదు..రష్యా అధ్యక్షుడు పుతిన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు