Florida University: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. ఫ్లోరిడా స్టేట్‌ వర్సిటీలో దుండుగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

New Update
gun fire

gun fire

అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి బయటకి వచ్చింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తలహాసీ నగరంలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన అనంతరం మొత్తం క్యాంపస్‌ను లాక్‌డౌన్ చేశారు. విద్యార్థులను గదుల్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కాల్పులకు పాల్పడిన ఆగంతుకుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Also Read: America-Gunturu:టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!

 అతడ్ని ఫోనిక్స్ ఇక్నేర్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. కానీ, పూర్తి వివరాలు వెల్లడించలేదు. మరొకరు గన్ ఫైరింగ్‌లో పాల్గొన్నారా? అన్న విషయాన్ని కూడా అధికారులు ధ్రువీకరించలేదు. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌లో ఒక్కసారిగా కాల్పులు శబ్దానికి భయంతో పరుగులు తీశారు. స్థానిక మీడియాతో వేన్ అనే విద్యార్ధి మాట్లాడుతూ. ‘కాల్పుల శబ్దానికి భయపడి విద్యార్థులు అంతా పరుగులు తీయడం మొదలు పెట్టారు. సుమారు నిమిషం తర్వాత, మేము 8 నుంచి 10 గన్ షాట్స్ విన్నాం. గాయపడిన ఓ వ్యక్తిని నేను చూశాను. కాల్పులు జరగడం ఎంతో వింతగా, ఆశ్చర్యంగా  అనిపించింది. ముందు ప్రశాంతంగా ఉంది ఒక్కసారిగా అస్తవ్యస్తంగా మారిపోయింది’ అని అన్నాడు.

Also Read: Aamir Khan: అమీర్ ఖాన్ తో జెనీలియా స్పెషల్ సాంగ్..

Mass Shooting At Florida University

ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో 40,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారంతా తమ తమ గదుల్లో నుంచి బయటకు రావద్దని యూనివర్సిటీ హెచ్చరించింది. క్యాంపస్ పరిసరాల్లో తుపాకితో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించినట్టు యూనివర్సిటీ సోషల్ మీడియాలో పేర్కొంది. "పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు.. గదుల్లో నుంచి బయటకు రావద్దు.. తలుపులు, కిటికీలకు దూరంగా ఉండండి. రక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అని సూచనలు చేసింది.

గాయపడినవారికి చికిత్స కొనసాగుతోందని తలహాసీ మెమోరియల్ హాస్పిటల్ ప్రకటించింది. ‘ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చేరగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. . మిగతావారు కూడా తీవ్రంగా గాయపడ్డారు’ అని ఆసుపత్రి ప్రతినిధి ఏఎఫ్‌పీకు తెలిపారు. శామ్ స్వార్జ్ అనే విద్యార్ధి మాట్లాడుతూ.. కాల్పులు జరిగిన సమయంలో అందరూ భయంతో అరుస్తూ పరుగులు తీశారని, సుమారు 10 గన్ షాట్స్ వినిపించాయని వివరించాడు.

తాను సహా 8 మంది ఒక ప్రాజెక్ట్‌పై పనిచేస్తుండగా హాల్‌లో డస్ట్ బిన్లు, ప్లైవుడ్‌‌ను తలుపులకు అడ్డుగా పెట్టి లోపలి కూర్చొన్నామని చెప్పారు. విద్యార్థులు చేతులు పైకి పైకి ఎత్తుతూ భవనాల నుంచి బయటకి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, అమెరికాలో కాల్పులు తరచుగా జరుగుతుంటాయి. ఆయుధాలు కలిగి ఉండటం రాజ్యాంగ హక్కు కావడంతో ఆయుధ నియంత్రణ చర్యలు తీసుకోవడం కష్టమవుతోంది.

దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ రాజకీయ వ్యవస్థ ఇప్పటికీ స్పందించడంలో విఫలమవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 81 కాల్పుల ఘటనలు అక్కడ చోటుచేసుకున్నాయి.

Also Read: Prabhas Fauji: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న డైరెక్టర్..?

Also Read: Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం పవన్ రేర్ ఫీట్.. ఏకంగా 1100 మందితో

 

telugu-news | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | international news in telugu | gun-shoot

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు