/rtv/media/media_files/2025/04/18/J1PFoDZPUY3Tgn5IciL5.jpg)
Actor shiny tom chako
నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు. దసరా విలన్ షైనీ టామ్ చాకో మీద వరుసగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్ననార్కోటిక్స్ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయిన చాకో మీద మలయాళ నటి లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. నటి విన్సీ సోనీ అలోషియస్ సినిమా సెట్స్ లో డ్రగ్స్ వినియోగించడమే కాక అతను తనపై లైంగిక దాడి కూడా చేశారని కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు విన్సీ ఫిర్యాదు చేశారు. సెట్స్ లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా మాట్లారని ఆమె చెబుతున్నారు. ఆ విషయాన్ని అప్పుడే దర్శకుడికి చెప్పానని...టామ్ చాకో ప్రవర్తనను మార్చుకోమని హెచ్చరించారని చెప్పుకొచ్చారు. సూత్రవాక్యం సెట్లో అతను తెల్లటి పౌడర్ నోట్లో నుంచి ఉమ్మి వేయడాన్ని చూశనని విన్సీ తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా చాకోపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో విన్సీకి అందరి మద్దతు ఉంటుందని కేరళ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ సాజి నంత్యాట్ తెలిపారు.
Also Read: Cinema: గద్దర్ అవార్డ్స్.. 15 మందితో జ్యూరీ నియామకం..
Also Read : విమానం హైజాక్ కి ప్రయత్నం..ప్రయాణికులు కాల్పులు జరపడంతో..!
మూడో అంతస్తులో నుంచి దూకి..
ఇక నిన్న నాని హీరోగా నటించిన 'దసరా' సినిమాలో విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు షైన్ టామ్ చాకో.. డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నారు. గురువారం రాత్రి కొచ్చిలోని ఓ హోటల్ లో నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ తనిఖీలు నిర్వహించగా.. అతడు తప్పించుకొని పారిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన అర్థరాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఈ సమయంలో పోలీసులను చూసిన షైన్ హోటల్ మూడవ అంతస్తు నుంచి మెట్ల మీద నుంచి పరుగెత్తుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కినట్లు సమాచారం.
Also Read: MI VS SRH : హైదరాబాద్ ను ఓడించిన ముంబై నాలుగు వికెట్ల తేడాతో..
Also Read : అమెరికాకు బాయ్..చైనాకు హాయ్..భారతీయులపై చైనా వీసాల వర్షం
drugs | harassment | actor-shine-tom-chacko | today-latest-news-in-telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news