/rtv/media/media_files/2025/07/27/non-veg-side-effects-2025-07-27-20-40-34.jpg)
Non-veg side effects:
ఒకవైపు చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ లేదా తందూరీ కబాబ్ వంటి నాన్-వెజ్ వంటకాలు ప్లేట్‌లో కనిపించగానే నోరూరే స్థితి ఉంటుంది. భారతదేశంలో చాలామంది రుచి కోసం.. బలానికి, ప్రోటీన్ అవసరాలకు నాన్-వెజ్ ఆహారాన్ని ఎక్కువగా తింటారు. అయితే రోజూ మాంసం తినడం వల్ల ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా వచ్చే ప్రభావాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలు, ఫైబర్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోకుండానే ప్రతి రోజూ మాంసాహారం తింటే.. అది శరీరాన్ని నెమ్మదిగా బలహీనత వైపు నడిపించవచ్చు. ప్రతిరోజూ మాంసం తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read : నలుగురు యువకులతో భార్య.. భర్తని ఏం చేసిందంటే?
మాంసం తింటే సమస్యలు వస్తాయా..?
మాంసాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచి, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు కారణమవుతుంది. ఎర్ర మాంసంలో అధికంగా ఉండే సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండకపోవడం, గుండెపోటు వంటి తీవ్రమైన పరిస్థితులు దోహదం కావచ్చు. నాన్-వెజ్ ప్రోటీన్ వనరుగా ఉపయోగపడినప్పటికీ.. అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి మూత్రపిండాలపై భారం పడుతుంది. దీర్ఘకాలంలో ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి లేదా మూత్రపిండాల పనితీరు తగ్గిపోవడానికి దారి తీయవచ్చు. రోజూ మాంసం తినడం వల్ల కడుపులో ఆమ్ల ఉత్పత్తి అధికమై, గుండెల్లో మంట, త్రేనుపు వంటి సమస్యలు కలిగించడమే కాక.. పేగులపై ప్రభావం చూపి పూతలకూ కారణమవుతుంది.
ఇది కూడా చదవండి: నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే..
ప్రాసెస్ చేసిన మాంసం లేదా బాగా కాల్చిన మాంసాన్ని తరచూ తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాక మాంసం ద్వారా అధికంగా వచ్చే కేలరీలు, కొవ్వులు శరీరంలో పేరుకుపోయి.. ఊబకాయం, జీవక్రియ సమస్యలు, అలసట వంటి ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు. సారాంశంగా చెప్పాలంటే.. మాంసం ప్రోటీన్ వనరుగా ఉపయోగపడినా.. దాన్ని పరిమితముగా తీసుకోవాలి. ప్రతిరోజూ మాంసం తీసుకోవడం శరీరాన్ని లోపలి నుంచి దెబ్బతీయవచ్చు. అందువల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా ముందుగా ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read : ‘HHVM’ నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం అదే.. మొత్తం చెప్పేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కడుపులో నులిపురుగులతో ఇబ్బంది ఉందా..? ఉపశమనం కోసం ఇలా చేయండి
( non-veg | non-veg-items | non-veg-recipes | side-effects | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news )