/rtv/media/media_files/2025/07/28/director-jyothi-krishna-special-interview-about-hari-hara-veeramallu-director-krish-2025-07-28-10-43-04.jpg)
director jyothi krishna special interview about hari hara veeramallu director krish
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇటీవల విడుదలై దారుణమైన టాక్ అందుకుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే కలెక్షన్లు మాత్రం ఘోరంగా పడిపోయాయి. మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. కానీ ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో దెబ్బకు పడిపోయాయి.
ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
అందుకే క్రిష్ వెళ్లిపోయాడు
ముఖ్యంగా ఇందులో వీఎఫ్‌ఎక్స్ విషయంలో బాగా ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయంపై దర్శకుడు జ్యోతికృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘హరిహర వీరమల్లు’ను ఓ కామెడీ సినిమాగా తీయాలనుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి తాను ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిని ‘మాయా బజార్’ మూవీ స్టైల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు క్రిష్ అనుకున్నారని.. దానికి అనుగుణంగానే దీనిని మొదలెట్టామని తెలిపారు.
ఇది కూడా చూడండి: పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
మొదటిగా ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించామని.. ఆ తర్వాత కరోనా వచ్చిందని అన్నారు. అనంతరం మరో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత సెకండ్ వేవ్ కరోనా వచ్చిందని.. ఆపై ఎలక్షన్స్ వచ్చాయిని పేర్కొన్నారు. దీంతో వరుసగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయని తెలిపారు. ఇలా క్రిష్ ఏడాది వెయిట్ చేశారని.. ఆయన ఒప్పుకున్న సినిమాలు ఉండటంతో ‘హరిహర వీరమల్లు’ నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాను ఈ స్టోరీని రెండు పార్టులుగా తీస్తానని పవన్ కల్యాణ్‌తో చెప్పడంతో ఆయన అంగీకరించినట్లు తెలిపారు. అక్కడ నుంచి తన జర్నీ ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ఇది కూడా చూడండి:సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
director jyothi krishna | director-krish | Pawan Kalyan | Hari Hara Veera Mallu