/rtv/media/media_files/2025/07/27/sleep-death-2025-07-27-20-13-38.jpg)
Sleep Death
Sleep Death: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మానసిక స్థితి మార్పులు వల్ల గుండె సంబంధిత వ్యాధుల పెరుగుతున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది దీర్ఘకాలిక గుండె వైఫల్యం. ఇది గుండె తగినంత రక్తాన్ని శరీరానికి సరఫరా చేయలేని స్థితిని సూచిస్తుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ క్రమంగా ఇది అభివృద్ధి చెందుతూ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అలసట, శ్వాస ఇబ్బందులు, పాదాలు, కాళ్ళలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన జరగడం, ఛాతీ బిగుతుగా అనిపించడం, గురక, మూర్చ, క్రమరహిత గుండె స్పందనలు మొదటగా గుర్తించవచ్చు. గుండె వైఫల్యం పురుషులలో ఎక్కువగా కనిపిస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ మహిళలకూ ఈ ప్రమాదం సమానంగా ఉంటుంది.
జీవనశైలిలో మార్పులు అత్యంత కీలకం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 45 ఏళ్లలోపు పురుషులకే ఈ వ్యాధి ఎక్కువగా కనిపించవచ్చని చెప్పినా.. 50 ఏళ్ల తర్వాత పురుషులు, మహిళలు ఇద్దరూ దీన్ని అనుభవించవచ్చు. దీర్ఘకాలిక గుండె వైఫల్యాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో మందుల ద్వారా గుండె పనితీరును మెరుగుపరచడం సాధ్యమవుతుంది. అయితే.. 3,4 దశలలో మందులు మాత్రమే చాలవు.. కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్స అవసరం అవుతుంది. 4వ దశలో గుండె పనితీరు 85-90% కోల్పోతుంది. ఈ దశలో గుండె మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం. ఈ వ్యాధి ప్రగతిని నివారించడానికి జీవనశైలిలో మార్పులు అత్యంత కీలకం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని నివారించేందుకు.. సరైన చిట్కాలు ఇవే..!!
అధిక రక్తపోటు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది కనుక దాన్ని నియంత్రణలో ఉంచడం అవసరం. రోజుకు రెండు లీటర్ల కంటే ఎక్కువ ద్రవాలు తీసుకోవద్దు. ఉప్పు మోతాదు తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా నివారించడం, నిత్యం స్వల్ప వ్యాయామం చేయడం చాలా అవసరం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండె సంబంధిత ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే.. సమస్యను ముందుగానే గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అందుకే మొదటి సంకేతం కనిపించినప్పుడే జాగ్రత్త పడటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చేతి వేళ్లల్లో కాలేయం సమస్య సంకేతాలు.. మీ గోళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా.?
( sleep | death | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | telugu-news | Latest News)