/rtv/media/media_files/2025/07/27/stomach-worms-2025-07-27-19-39-10.jpg)
Stomach Worms
Stomach Worms: కడుపులో నులిపురుగులు ఉండటం ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య చిన్నదిగా అనిపించినా.. దీని ప్రభావం శరీరంపై తీవ్రమైనదిగా ఉండొచ్చు. ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం, అలసట, కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు ఇందుకు సంకేతాలు. మందులతోపాటు కొన్ని ఇంటిలో ఉండే సహజ పదార్థాలను ఉపయోగించినా కూడా పురుగులను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద పద్ధతుల్లో చెప్పిన ఈ ఇంటి నివారణలు పిల్లలు, పెద్దల రెండింటికీ అనుకూలంగా పనిచేస్తాయి.
నులిపురుగుల సమస్యకు ఉపశమనం..
వెల్లుల్లి కడుపులోని క్రిములను నిర్మూలించడంలో అత్యంత ప్రభావవంతమైనదిగా పని చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ప్యారాసిటిక్ లక్షణాలు పురుగులను చంపడానికి సహాయపడతాయి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలడం ద్వారా శరీరంలో మలబద్ధకాన్ని తగ్గించడంతోపాటు పురుగుల ప్రభావం తగ్గుతుంది. అదే విధంగా పచ్చి బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు కూడా నులిపురుగులను చంపే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక టీస్పూన్ బొప్పాయి రసం, తేనె, గోరువెచ్చని నీటిని కలిపి ఉదయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. వేపాకులు ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. 5 నుండి 6 వేపాకులను మెత్తగా చేసి.. తేనెతో కలిపి తీసుకుంటే కడుపులో పురుగుల ప్రభావం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: శుభవివాహానికి కాత్యాయనీ మంత్రం మహా శక్తివంతమైన మార్గం
ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమం. అలాగే పసుపు ఒక సహజ క్రిమినాశకంగా పనిచేస్తుంది. చిటికెడు పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే.. నులిపురుగుల ప్రభావం తగ్గుతుంది. పచ్చి పసుపు రసం అయితే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొబ్బరి కూడా పురుగుల నివారణలో సహాయపడుతుంది. తురిమిన కొబ్బరి లేదా ఒక చెంచా కొబ్బరి నూనెను ఉదయం తీసుకోవడం వల్ల శరీరం నుంచి క్రిములు తొలగిపోతాయి. అజ్వైన్, బెల్లం కలయిక కూడా చాలా ప్రభావవంతమైన ఇంటి చికిత్స. ఒక చెంచా అజ్వైన్‌ను బెల్లంతో కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటే.. కడుపు శుభ్రంగా ఉండి శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. ఈ ఇంటి నివారణలు క్రమంగా పాటిస్తే.. కడుపు నులిపురుగుల సమస్యను సహజంగా నివారించవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని నివారించేందుకు.. సరైన చిట్కాలు ఇవే..!!
( stomach | worms | worms-in-stomach | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)