Hyderabad: నలుగురు యువకులతో భార్య.. భర్తని ఏం చేసిందంటే?

హైదరాబాద్‌ దుండిగల్‌లో భర్తని చంపేందుకు భార్య నలుగురు యువకులతో స్కెచ్‌ వేసింది. బాచుపల్లి రాజీవ్ గృహకల్పలో రాందాస్‌, ఆయన భార్య నివాసముంటున్నారు. గత వారం రాందాస్‌పై నలుగురు యువకులు దాడి చేశారు. భార్యే చంపించాలునుకుందని రాందాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update

భర్త హత్యకు ప్లాన్ చేసిన ఓ భార్య దొరికిపోయింది. హైదరాబాద్‌ దుండిగల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. భర్తను చంపేందుకు భార్య నలుగురు యువకులతో స్కెచ్‌ వేసింది. బాచుపల్లి రాజీవ్ గృహకల్పలో రాందాస్‌, ఆయన భార్య నివాసముంటున్నారు.

అయితే గత వారం రాందాస్‌పై నలుగురు యువకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. దుండిగల్‌ సమీపంలో బీర్‌ బాటిల్స్‌తో రాందాస్‌పై దాడి చేశారు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాందాస్‌ చనిపోయాడని వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో రాందాస్‌ బతికిబయటపడ్డాడు. తనని చంపేందకు భార్యనే కుట్ర చేసిందంటూ రాందాస్ ఆరోపిస్తున్నాడు. బాచుపల్లి పోలీసులకు భార్యపై ఫిర్యాదు ఇచ్చాడు. 

సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు

ఇటీవల ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్యలకు కోర్టు తాజాగా రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకొని.. విచారించగా సంచలన విషయాలు బయటపెట్టారు.

బిహార్‌లో 

ఇటీవల బీహార్‌లోని మోతిహారి జిల్లాలో ఓ కసాయి తల్లి 24 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసింది. వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉంటున్న తల్లి.. ఓ రోజు కొడుకుకి అభ్యంతరకరమైన స్థితిలో కనిపించింది. వేరే వ్యక్తితో తల్లి ఇలా ఉండటాన్ని చూసి ఆ కొడుకు షాక్ అయ్యాడు.

 attck | hyderabad | dundigal | wife murder husband news | wife plan to kill husband

Advertisment
తాజా కథనాలు