Rabies: కుక్క గోళ్ల గీతల వల్ల రేబిస్ వస్తుందా..? ప్రాణాంతక వ్యాధి నిజాలు ఇవే

రేబిస్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క గోళ్లు గీసినందుకే రేబిస్ సోకదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కుక్క తన గోళ్లను నాకినపుడు లేదా గోళ్లపై లాలాజలం ఉండినపుడు గోళ్లతో గీసితే.. అప్పుడే రేబిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

New Update
Rabies

Rabies

ప్రస్తుతం సమాజంలో కుక్కలు కొరకడం, గోళ్లతో గీరటం వంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు చాలా మందిని మానసికంగా భయపెడతాయి. ముఖ్యంగా రేబిస్ గురించి ఆలోచించినప్పుడు ఆ భయం మరింత పెరుగుతుంది. చాలా మందికి కుక్క కాటు వల్ల రేబిస్ వస్తుందని తెలుసు. అయితే కుక్క గోళ్ల వల్ల కూడా రేబిస్ వస్తుందా? అనే ప్రశ్న చాలా మందిని కలవరపెడుతుంది.  ఎందుకంటే రేబిస్ ప్రాణాంతక వ్యాధి. ఒకసారి లక్షణాలు ప్రారంభమైన తరువాత దీనికి చికిత్స ఉండదు. కాబట్టి రేబిస్ విషయంలో ముందు జాగ్రత్తలే ఉత్తమ మార్గం.

Also Read :  ఓరి దేవుడా తెలియక వచ్చే కలలతో ఆరోగ్యానికి ఇంత ముప్పు ఉందా?

రేబిస్ లక్షణాలు కనబరుస్తే..

కుక్క గోళ్లు గీసినందుకే రేబిస్ సోకదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కుక్క తన గోళ్లను నాకినపుడు లేదా గోళ్లపై లాలాజలం ఉండినపుడు గోళ్లతో గీసితే.. అప్పుడే రేబిస్ వచ్చే అవకాశం ఉంటుంది. గోళ్లు గీసిన గాయం లోతుగా ఉంటే రక్తం బాగా వస్తే కూడా ప్రమాదం పెరుగుతుంది. అదేవిధంగా.. ఆ కుక్కకు టీకాలు వేయబడకపోతే.. లేదా ఆ కుక్క విచ్చలవిడిగా ప్రవర్తించి రేబిస్ లక్షణాలు కనబడితే మరింత జాగ్రత్త అవసరం. గోళ్ల గీతల కారణంగా చర్మం బాగా తెరచి లోపలికి వైరస్ ప్రవేశించే అవకాశం ఉంటే తప్పించుకోవడం కష్టం.

ఇది కూడా చదవండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

ఇలాంటి సందర్భాలలో వెంటనే గాయాన్ని 15 నిమిషాల పాటు సబ్బుతో కడగడం చాలా ముఖ్యం. తర్వాత బెటాడిన్ వంటి  మందును ఉపయోగించాలి. ఒకవేళ గాయం లోతుగా ఉంటే.. లేదా గాయంలోకి లాలాజలం వెళ్లిపోయే అవకాశముంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. డాక్టర్ సలహా మేరకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చిన్న చిన్న గీతలు ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండటమే రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి మనల్ని రక్షించే మార్గం. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వారు జంతువులతో ఎలా వ్యవహరించాలో నేర్పించడం అవసరం. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవన్నీ పాటిస్తే.. రేబిస్ నుంచి మనల్ని మనమే కాపాడుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: తిరుమలలో కలకలం.. లోయలో దూకిన భక్తుడు

ఇది కూడా చదవండి: శ్రావణ మాసంలో ఐదు కలలు చాలా శుభప్రదం..శివుని ఆశీర్వాదంతోపాటు...!!

(rabies | rabies vaccinations | dog | Health Tips | latest health tips | best-health-tips | diabetes-health-tips | fish-health-tips | Latest News | telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు