/rtv/media/media_files/2025/07/16/bad-dreams-2025-07-16-15-52-05.jpg)
Bad Dreams
హాయిగా సేద తీరుతామని కళ్లు మూస్తే చాలు కొందరికి కలలు వస్తుంటాయి. ఇందులో కొన్ని హ్యాపీనెస్ ఇచ్చే కలలు అయితే మరికొన్ని పీడకలలు కొందరికి వస్తుంటాయి. మనం ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తే ఆ కలలు వస్తుంటాయని కొందరు అంటుంటారు. అయితే ఎవరికి ఎలాంటి కలలు వస్తాయనే విషయం అయితే ఎవరికీ తెలియదు. కానీ మనకి వచ్చే కొన్ని కలలు ఆరోగ్యానికి ముప్పు అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
The occurrence of nightmares could be due to heart conditions, migraine, sleep deprivation and beta blockers. pic.twitter.com/cJWTPPLSv4
— know (@Know) March 3, 2016
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
తొందరగా ముసలితనం..
ఎవరైనా కూడా మంచి కలలు రావాలని అనుకుంటారు. కానీ కొందరికి పీడకలలు వస్తుంటాయి. ఈ కలలు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ పరిశోధకులు తెలిపారు. ఎప్పుడో ఒకసారి పీడకలలు వస్తే పర్లేదు.. కానీ డైలీ వస్తే మాత్రం ముసలితనం తొందరగా వస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. యంగ్ ఏజ్‌లో ఉన్నా కూడా వృద్ధాప్యం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ డాక్టర్లు 8-10 ఏళ్ల మధ్య వయసున్న 2,429 మంది పిల్లలు, 26-86 ఏళ్ల మధ్య వయసున్న 1,83,012 మంది పెద్దలపై ఈ అధ్యయనం చేశారు. వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పీడకలలు వచ్చే వ్యక్తులు 70 ఏళ్లు నిండక ముందే చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. పోషకాహార లోపం, ఊబకాయం, ధూమపానం కంటే పీడకలు అకాల మరణాలకు కారణమని పరిశోధకులు గుర్తించారు. పీడకలలు ఎవరికైతే ఎక్కువగా వస్తాయో వారికి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Bad dreams | health-issues