/rtv/media/media_files/2025/07/16/tirupathi-crime-news-2025-07-16-13-55-15.jpg)
tirupathi crime news
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ప్రధాన నడక మార్గాలలో ఒకటైన అలిపిరి నుంచి తిరుమల వరకు ఉన్న మార్గంలో అవ్వాచారి కోన ప్రాంతం ఓ కీలకమైన దారిగా ఉంది. రోజూ వేలాది మంది భక్తులు ఈ మార్గంలో నడిచి స్వామివారి దర్శనానికి చేరుకుంటారు. అయితే మంగళవారం జరిగిన ఓ విషాద సంఘటన అక్కడ ఉన్న భక్తులను, అధికారులు కలవరపాటుకు గురిచేసింది. అవ్వాచారి కోన వద్ద ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో లోయలోకి దూకాడు. ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
Also Read : కేసీఆర్తో హరీష్ అత్యవసర భేటీ.. కారణం అదేనా?
లోయలో దూకిన భక్తుడు..
ఘటనపై అప్రమత్తమైన అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిపోయిన వ్యక్తిని గుర్తించి అతన్ని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. ఆ వ్యక్తిని అక్కడి నుంచి పైకి తీసి వెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు అతని వివరాలను కూడా సేకరించిన అధికారులు.. అతడు కడప జిల్లాకు చెందిన దోర్నపాడు గ్రామానికి చెందిన బోయ మాధవ రాయుడు అని గుర్తించారు. ప్రమాదం వల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే అతడు లోయలోకి ఎందుకు దూకాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.
Also Read : పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
తిరుమల అవ్వాచారి కోనలో దూకిన వ్యక్తి
— Telugu Feed (@Telugufeedsite) July 16, 2025
తిరుమల నడకమార్గంలోని అవ్వచారి కోన వద్ద లోయలోకి దూకిన ఓ వ్యక్తి.. భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం
లోయ నుంచి బయటకు తీసి తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలింపు
దోర్నపాడు గ్రామానికి చెందిన బోయ మాధవ రాయుడుగా గుర్తింపు.#Tirumala… pic.twitter.com/jXggiIPgC4
సంఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో భక్తులు తిరుమల వెళ్లే నడకదారిలో మరింత జాగ్రత్తగా ఉండాలని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా అలాంటి ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు అభిప్రాయపడుతున్నారు. తిరుమల పర్వత మార్గాల్లో ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో వంకాయలు తింటే ప్రమాదకరమా..? ఇక్కడ వివరాలు తెలుసుకోండి
( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | Latest News | telugu-news ap-crime-report )