🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. సింగరేణి సంస్థ సహకారంతో మే 24న ఖమ్మం వైరాలో మేగా జామ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. 80 సంస్థలు, 5000 ఉద్యోగాలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో 35 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. విద్య, వైద్య, ఆర్టీసీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది.
2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.
నిస్సాన్ మోటార్ ఒకేసారి 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనాల్లో అమ్మకాలు తగ్గడంతో కంపెనీ ఆదాయం 94 శాతానికి పడిపోయింది. ఈ క్రమంలోనే 15 శాతం ఉద్యోగస్థులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
రైల్వే శాఖ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 9,970 పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచించాయి.
ఏపీ గ్రూప్-1 అవకతవకలపై సంచలనాలు బయటపడుతున్నాయి. పరీక్ష పేపర్లను టీచర్, గృహిణీ, వెల్డర్తో దిద్దించినట్లు దర్యాప్తులో తేలింది. పేపర్ వెనుక దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. కానీ ఆ స్థానంలో ఈ ముగ్గురి సంతకాలు ఉండటం సంచలనం రేపుతోంది
భారత్-పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ICAI ప్రకటించింది. నేటి నుంచి మే 14వ తేదీ వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలోనే తెలపనుంది.