🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం

author-image
By Manoj Varma
New Update
LIVE BLOG

Live News Updates

  • May 18, 2025 09:55 IST

    కాలిఫోర్నియాలో బాంబు పేలుడు.. ఒకరు మృతి

    అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా FBI దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది.

    Bomb blast
    Bomb blast

     



  • May 18, 2025 09:54 IST

    సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం

    చెన్నై సెంట్రల్‌ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి.సేలం సెంట్రల్ జైలులో ఉన్నస్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వచ్చి ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. బిస్కట్‌ ఫ్యాకేట్‌లో గంజాయి తీసుకువచ్చి ఆ యవకుడు పోలీసుల చేతికి చిక్కాడు.

    Central Jail Salem
    Central Jail Salem

     



  • May 18, 2025 09:54 IST

    సుచిత్రలో హై టెన్షన్‌.. మల్లారెడ్డి భూమలు సర్వే

    మాజీమంత్రి మల్లారెడ్డి భూముల్లో మరోసారి వివాదం చెలరేగింది. సుచిత్రలో ఉన్న భూములు సర్వే చేయడానికి అధికారులు చేరుకోగా సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారంటూ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. సర్వేపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

    Malla Reddy
    Malla Reddy

     



  • May 18, 2025 09:53 IST

    అన్నమయ్య జిల్లాలో విషాదం.. బావిలోకి కారు స్పాట్‌లోనే ముగ్గురు!

    అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణించడం వల్ల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

     



  • May 18, 2025 09:52 IST

    మిస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ విజేతగా ఎస్తోనియా భామ ఎలిస్‌ రాండ్మా

    హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్‌ పోటీల్లో మిస్‌ వరల్డ్‌ ఎస్తోనియా ఎలిస్‌ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో తదుపరి రౌండ్‌కు చేరుకోవడం ఎస్తోనియా దేశానికి ఇదే మొదటిసారి.

    Miss World 2025
    Miss World 2025

     



  • May 18, 2025 09:52 IST

    మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు నెలల చిన్నారితో సహా ఆరుగురు..?

    మహారాష్ట్ర శిర్పూర్ జైన్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ఈ మంటల్లో ఆరు నెలల చిన్నారితో పాటు మరో ఆరుగురు చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వీరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.



  • May 18, 2025 09:51 IST

    ఐఎండీ బిగ్ అలర్ట్.. శక్తి తుపాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

    దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది తుపానుగా మారనుంది. నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



  • May 18, 2025 07:48 IST

    సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

    భారత సైన్యానికి కీలక అధికారాలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర సమయాల్లో ఆముదాలు, డిఫెన్స్ ఎక్విప్ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా అధికారాలు అప్పగించింది.

    Indian Army
    Indian Army

     



  • May 18, 2025 07:47 IST

    ఇండియా పాక్‌ యుద్ధం..పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబురాలు

    ఇండియా పాకిస్తాన్ యుద్దం ముగిసిన తర్వాత ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ఇండియా పై గెలిచామంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది.

    SHAMELESS Shahid Afridi & Shoaib Akhtar.
    SHAMELESS Shahid Afridi & Shoaib Akhtar.

     



  • May 18, 2025 07:47 IST

    పీఎస్‌ఎల్వీ సీ 61 రాకెట్‌ ప్రయోగం విఫలం

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన రాకెట్‌ ప్రయోగం లో సాంకేతిక సమస్య ఏర్పడింది. రెండు దశలను పూర్తి చేసుకున్న రాకెట్‌ మూడవ దశకు చేరుకునేటప్పటికీ  ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో రాకెట్ ప్రయోగం విఫలం అయింది.

    PSLV C 61
    PSLV C 61

     



  • May 18, 2025 07:46 IST

    వైద్య విధానంలో కొత్త ఆవిష్కరణ.. ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్‌!

    ప్రపంచంలోనే ఏఐతో పరీక్షించే క్లినిక్‌ను మొదటిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభించింది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో అల్‌మూసా హెల్త్‌ గ్రూప్‌ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 30 రకాల శ్వాసకోశ రుగ్మతలకు సేవలు అందిస్తున్నారు.

    First AI Docter
    First AI Docter

     



  • May 18, 2025 07:45 IST

    జ్యోతి ఇంస్టాగ్రామ్ లో షాకింగ్ విషయాలు...పహల్గాం సమాచారం చేరవేత ?

    దేశానికి ముప్పు తలపెట్టేలా పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పహల్గాం సమాచారాన్ని చేరవేసింది జ్యోతినే అని తేలింది. ఆమె జనవరిలోనే పహల్గాంను సందర్శించి..అక్కడి విషయాలను పాకిస్తాన్ కు పంపినట్లు తేలింది.

    Jyoti Malhotra
    Jyoti Malhotra

     



  • May 18, 2025 07:45 IST

    పౌరసత్వం కావాలంటే గేమ్ ఆడాలి..అమెరికా ట్రంప్ ప్రభుత్వం చెత్త ఐడియా

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనలకు హద్దు లేకుండా పోతోంది. ఇప్పటికే వలసదారులను పంపించేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు మరో చెత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు అమెరికాలో ఒక రియాలిటీ షో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది.

    Donald Trump
    Donald Trump

     



  • May 18, 2025 07:43 IST

    'విరాట్ కోహ్లీకి భారతరత్న'

    దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కోహ్లీకి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. ఇండియన్ క్రికెట్‌కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించాలన్నారు. క్రీడల్లో ఫస్ట్ సచిన్ టెండూల్కర్‌కు ఈ అవార్డు ఇచ్చారు.

    virat
    King Kohli

     



  • May 18, 2025 07:42 IST

    నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్ఎల్వీ 61

    భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట నుంచి ఇస్రో మరో ప్రయోగం పీఎస్ఎల్వీ 61 నింగిలోకి దూసుకెళ్లింది. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ నిఘా ఉండడం కోసం ఇస్రో దీన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఉదయం 5.59 నిమిషాలకు ఈ ప్రయోగం జరిగింది. 



Advertisment
Advertisment
తాజా కథనాలు